మోదీ సర్కారుకు పెద్ద మచ్చ.. పరువు పోయిందిగా?

ప్రధాని మోదీపై ట్విటర్ మాజీ సీఈవో జార్క్ డార్సీ ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. ఇండియాలో రైతు ఉద్యమం జరిగిన సమయంలో ట్విటర్ కు భారత ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిందని, బెదిరింపులకు దిగిందని ఆరోపించారు. అలాంటి వార్తలను ప్రోత్సహించొద్దు.ఒక వేళ రైతులకు సంబంధించిన వార్తలను ఎక్కువగా రాస్తే వారిపైన కేసులు పెడతాం. ట్విటర్ సంస్థలను క్లోస్ చేస్తాం. సంస్థలో పని చేసే ఉద్యోగులపై కేసులు పెడతామని కేంద్ర ప్రభుత్వం బెదిరించిందని పేర్కొన్నారు.


ట్విటర్ ను అడ్డుపెట్టుకుని ఏకంగా అమెరికా అధ్యక్షుడిపైనే ఆరోపణలు చేసిన వారు అలాంటిది ఇండియాపై ప్రధాని నరేంద్ర మోదీపై అభియోగాలు మోపరని గ్యారంటీ ఏంటి? సోరెస్ లాంటి వారు ఇండియాలోని పారిశ్రామిక వేత్తలను దెబ్బతీసి హిండెన్ బర్గ్ లాంటి నివేదికలు బయటపెడుతుంటే వారికి మద్దతు తెలపడంలో ట్విటర్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే భారత్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవాలని భావిస్తుంటుంది.


అమెరికా, యూరప్ దేశాలు కలిసి ఉక్రెయిన్ ను అడ్డు పెట్టుకుని రష్యాపై నాటో దేశాలు కలిసి దాడులు చేస్తుంటే అక్కడ జరుగుతున్న విధ్వంసం గురించి ట్విటర్ మౌనంగా ఎందుకు ఉంటోంది. అమెరికాకే ఎందుకు సపోర్టు చేస్తుంది. కారణం అమెరికా సొంత దేశం కాబట్టి అక్కడ ఏదీ చేసిన తప్పు కాదు. మిగతా వారు చేస్తే తప్పు కాబట్టి ఇలాంటి విదేశీ సంస్థలు భారత్ పై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్న సమయంలో బెదిరించడం తప్పు కాదని చాలా మంది రాజకీయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


ట్విటర్ భారత్ లో రైతుల నిరసన దీక్షలు జరుగుతుంటే దాన్ని ప్రపంచానికి చూపెడుతూ.. తప్పుడు సంకేతాలు పంపినపుడు ఇక్కడ జరుగుతుంది రైతుల ఆధ్వర్యంలోనా.. లేక రైతుల ముసుగులో ఉన్న పెట్టుబడి దారులు చేయిస్తున్నదా అని తెలుసుకోవాల్సిన బాధ్యత ట్విటర్ పై ఉంది. కానీ అవేవీ పట్టించుకోకుండా విష ప్రచారం చేేస్తే చూస్తూ ఊరుకునేది లేదని కేంద్ర ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: