రష్యాకు బిగ్‌ షాక్‌ ఇచ్చిన స్మాల్‌ కంట్రీ?

ప్రపంచంలో ఆధిపత్య పోరాటం అనేది ఎప్పుడూ సాగుతూనే ఉంటుంది. గతంలో బ్రిటన్ రవి అస్తమించని సామ్రాజ్యాన్ని స్థాపించి ప్రపంచాన్ని శాసించారు. కానీ అది ఎప్పటికీ అలాగే ఉండదు. రోజులు మారాయి. అన్ని దేశాలు తమకు స్వతంత్రం కావాలని పోరాటం చేసి స్వేచ్ఛ స్వాతంత్య్రాలను సాధించుకున్నాయి.


అయితే అనంతరం కాలంలో అమెరికా ప్రపంచంలో అన్ని రంగాల్లో ఎదగడం, రష్యా అతి పెద్ద దేశంగా మారడం, చైనా ఆర్థికంగా బలపడటం తో వివిధ దేశాల్లో సామ్రాజ్య వాద విస్తరణ కాంక్ష పెంచుకున్నాయి. ఇలా రష్యా, అమెరికా వివిధ దేశాలపై దాడులకు దిగడం ప్రారంభించాయి. అమెరికా, వియత్నాం, క్యూబా లాంటి దేశాలపై దాడులు చేసి ఓటమి చెందిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం రష్యా కూడా ఉక్రెయిన్ దేశంపై విరుచుకుపడి యుద్ధం చేస్తోంది.


500 రోజులుగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. అయినా ఉక్రెయిన్ మాత్రం తమ దేశ భూభాగంపై జరుగుతున్న దాడిని ఖండిస్తూనే ముందుకు దూసుకుపోతుంది. అమెరికా, ఆఫ్గానిస్తాన్, ఇరాక్, లిబియా లాంటి దేశాలపై కూడా దాడులు చేసి అక్కడ ఎంతో విధ్వంసం సృష్టించింది. అఫ్గానిస్తాన్ లో 20 ఏళ్ల తర్వాత అన్ని సర్దుకుని అమెరికాకు వచ్చేసింది. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ విధ్వంసం సమయంలో చిన్న దేశమైన ఐస్ లాండ్ రష్యాకు షాక్ ఇచ్చింది.


రష్యాతో అన్ని విధాలుగా తెగదెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. రష్యా నుంచి తమ దౌత్య కార్యాలయం తీసివేస్తున్నట్లు ప్రకటించింది. సామ్రాజ్య వాద కాంక్షతో చిన్న దేశాలపై దాడులు చేసే వారికి ఎలాంటి మద్దతు ఇవ్వబోమని తేల్చి చెప్పేసింది. ఐస్ లాండ్ తమ దేశంలో ఉన్న రష్యా దౌత్యాధికారులను  తక్షణమే ఖాళీ చేయాలని ఆదేశించింది. చిన్న దేశమైన రష్యాకు ఝలక్ ఇచ్చిందని ప్రపంచ వ్యాప్తంగా అందరూ అనుకుంటున్నారు. ఐస్ లాండ్ చేసిన పనికి అభినందనలు తెలుపుతున్నారు. మరి ఐస్ లాండ్ ఇలా చేయడం వెనక అమెరికా, యూరప్ దేశాలు ఉన్నట్లు వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: