అమెరికా.. ఉక్రెయిన్ను నిండా ముంచేస్తోందా?
రష్యా పైకి యుద్ధానికి పురిగొల్పి ఆయుధాలను కూడా ఇస్తుంది అమెరికా. అయితే ఉక్రెయిన్ కు అమెరికా ఇచ్చే ఆయుధాలు ఐదు శాతం మాత్రమే అని తెలుస్తుంది. కానీ అమెరికా పెద్ద హడావుడి చేస్తూ ఉక్రెయిన్ కు ఇచ్చే ఆయుధాల విలువ ఇన్ని వందల కోట్లు, అన్ని వందల కోట్లు అంటూ చెప్పుకొస్తుంది. అసలు ఉక్రెయిన్ కు ఐదు శాతం అమెరికా ఆయుధాలను ఇస్తుంటే, 95% యూరప్ ఇంకా నాటో దేశాల ద్వారా పంపిస్తూ ఉంటుంది అమెరికా.
పైగా వాళ్లు చేసే సహాయాన్ని కూడా అమెరికా తాను చేసినట్లుగా హడావుడి చేస్తూ ఉంటుంది. అసలు ఇప్పుడు ఉక్రెయిన్ కి ఆయుధాలు అందించడానికి అమెరికా దగ్గర ఆయుధాలు కూడా సిద్ధంగా లేవు అని తెలుస్తుంది. దాని దగ్గర ఆయుధాలు లేకపోయినా, అది ఇచ్చేది తక్కువైనా సరే హడావుడి మొత్తం అమెరికానే చేస్తుంది. ఉక్రెయిన్ సైన్యానికి ఆయుధాలు ఇవ్వాలంటే ఆయుధాలు సిద్ధంగా లేవు.
కాబట్టి ఆయుధాలు ఇవ్వాలంటే ఇప్పుడు మళ్ళీ ఆయుధాలను తయారు చేసి ఇవ్వాలి. అసలు నిజానికి ఉక్రెయిన్ అమెరికాపై ఆయుధాల కోసం ఆశపెట్టుకుంటే మాత్రం ఎప్పుడో రష్యా చేతిలో పరాజయం పాలయ్యేది. ఈ ఆయుధాలు తయారు చేయడానికి యూరప్ ఇంకా నాటో దేశాలు అమెరికా కంపెనీలకు డబ్బులు చెల్లిస్తున్నాయి అని తెలుస్తుంది. వీళ్ళు ఇచ్చిన ఆయుధాలు అన్ని యుద్ధంలో అయిపోయాక అప్పుడు అమెరికా ఉక్రెయిన్ కు ఇస్తుందట. కానీ ఉక్రెయిన్ కు ఆయుధాలన్నీ తానే ఇస్తున్నట్లుగా చెప్పుకొస్తుంది అమెరికా.