పవన్ ఎఫెక్ట్: బాబుకి మళ్లీ టెన్షన్ మొదలైందా?
పొత్తు పెట్టుకుని ఏమైనా తప్పులు చేశామా అని ఆలోచనలో పడ్డారు. అనంతరం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోవడం కొన్ని మీడియా సంస్థలు తెలంగాణకు అనుకూలంగా వార్తలు రాయడం, కేసీఆర్ నిరసన దీక్ష ఒక్కో అంశం కలిసి వచ్చింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితి అలానే ఉంది. మొన్నటి వరకు జనసేన, టీడీపీ పొత్తు కుదిరిందనే వార్తలు వినిపించాయి. ఇక రాబోయే ఎన్నికల్లో సీట్ల పంపకం మాత్రమే ఉందని చెప్పుకున్నారు. అమిత్ షాతో చంద్రబాబు మీటింగ్ తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. అంతా బాగుంది జగన్ ను ఇక ఓడించడమే తరువాయి అనుకుంటున్న సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ షాక్ ఇచ్చారు.
వారాహి యాత్ర మొదలు పెట్టిన తర్వాత ప్రచారం లో దూకుడుగా ముందుకు సాగుతున్నారు. జనసేనకు అవకాశం ఇవ్వాలని మీ గురించి పోరాడే పార్టీ జనసేన మాత్రమేనని ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే తానేంటో నిరూపిస్తానని ప్రచారం చేస్తున్నారు. దీంతో ఇన్ని రోజులు పొత్తు పెట్టుకుని ఏవో కొన్ని సీట్లు ఇచ్చేస్తే సరిపోతుందని అనుకున్న చంద్రబాబు పవన్ స్పీచ్ తర్వాత ఆయనలో మళ్లీ టెన్షన్ మొదలైందని అనుకుంటున్నారు.