అయోమయం పవన్.. కన్ఫ్యూజన్‌లో ఫ్యాన్స్‌?

పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన్ని సీఎంగా చూడాలని కోరుకునే అభిమానులు, సాధారణ ప్రజలూ  చాలా మందే ఉన్నారు.  అవినీతి లేని రాజకీయాన్ని తీసుకు వస్తారని, ఒక కొత్త రాజకీయానికి తెర లేపుతారని ఆశలు పెట్టుకున్న వాళ్లు చాలా మంది ఉన్నారు. అయితే పవన్ సీఎం గా కావాలని జనాలు కోరుకుంటున్నారు బానే ఉంది. దాంట్లో ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు.


వాళ్లు అదే పాయింట్ మీద స్థిరంగా ఉన్నారు. ఇక్కడ వరకు బానే ఉన్నా, ఎవరి మీద అయితే వాళ్ళు ఆశలు పెట్టుకుంటున్నారో ఆ పవన్ కళ్యాణ్ మాత్రం ఒక మాట మీద స్థిరంగా ఉండడం లేదని వాళ్లలో వాళ్లే ఇప్పుడు అనుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఒకసారి తాను సింగిల్ గా వస్తానని అంటారు. మరొకసారి నన్ను సీఎం గా ఎవరు ఛాన్స్ ఇస్తారు. బిజెపి కానీ తెలుగుదేశం కానీ నాకు సీఎం ఛాన్స్ ఇవ్వరు కదా అని అంటారు.


గతంలోనే మనం ఎక్కువ సీట్లు గెలుచుకుంటే ఆ ధైర్యంతో పోటీ చేసి అడగడానికైనా బాగుండేది ఇప్పుడు కుదరదు కదా అని కూడా ఆయనే అంటారు. ఒకసారి సింగిల్ గా పోటీ చేస్తానని చెప్పే ఆయన, మరొకసారి పొత్తులతోనే వెళ్తున్నామని చెప్తారు. తమకు గౌరవప్రదమైన సీట్లు ఇస్తే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటాం అని, తెలుగుదేశంతోనే కలిసి వెళ్తామని చెప్తూ ఉంటారు. ఒకసారి బిజెపి తో కలిసి వెళ్తామంటారు.


మరొక సారి బిజెపి, తెలుగుదేశం ఇంకా తాము ముగ్గురు కలిసి పోటీ చేస్తామని చెప్తారు. అయితే ఈ మాటల్లో వేటిలోనూ ఒకదానితో ఒకదానికి సంబంధం లేని పరిస్థితి కనిపిస్తుంది. ఆయన ఒక పార్టీ అధ్యక్షుడుగా ఎవరితోనైనా పొత్తు కలుపుకొనే అవకాశం ఆయనకి ఉంటుంది. ఆయన తెలుగుదేశంతో కలిసి వెళ్లొచ్చు, లేదా బీజేపీతో కలిసి లేదా కమ్యూనిస్టులతో కలిసి వెళ్ళచ్చు. కానీ ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వాలి అంటున్నారు జనాలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: