మరో దేశంపైకి యుద్ధానికి రెడీ అవుతున్న రష్యా?

పోలాండ్ గతంలో రష్యాలో భూభాగం. ఇప్పుడు ఉక్రెయిన్ కి పొరుగున ఉన్న దేశం. అయితే పోలాండ్ పెద్ద ఎత్తున ఉక్రెయిన్ కి ఆయుధాలను సమకూరుస్తుంది. దీన్ని బట్టి చూస్తే రష్యా పోలాండ్ మీద కూడా దాడి చేయడానికి సిద్ధమవుతోంది అన్నట్లుగా తెలుస్తుంది అని చెప్తున్నారు. అయితే మొన్నా మధ్యన పోలాండ్ రష్యాను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది అని తెలుస్తుంది. అయినా కూడా రష్యా ఇప్పటివరకు కూడా పోలాండ్ మీద ఎటువంటి దాడి చేయలేదు.


ఉక్రెయిన్ మొన్న రష్యా నుండి స్వాధీనం చేసుకున్న యుద్ధ ట్యాంకులు, మిసైల్స్, లాంచర్లు వీటి ద్వారా రెండు బాంబులు పోలండ్ లోపలికి వెళ్లి పడ్డాయట. ఆ సమయంలో ప్రపంచ దేశాలన్నీ కూడా జీ7 సమావేశంలో మునిగి ఉన్నాయట. ఆ టైంలో భారత్ కూడా అదే సమావేశంలో ఉండగానే అమెరికాకు ఆ విషయం తెలిసిందట. దాంతో యుద్ధానికి సిద్ధమవ్వమని అంతా ప్రిపేర్ చేస్తుండగా అమెరికా భద్రతా సలహాదారు తొందరపడకండి విషయం ఏమిటో చూద్దామని చెప్పాడట.


ఆ తర్వాత ఆయన చెప్పింది ఏమిటంటే పోలాండ్ ఇంకా ఉక్రెయిన్ ఇద్దరూ కలిసి ఆడిన నాటకం అది అని చెప్పాడట. నాటోను రంగంలోకి దించి రష్యాను ఓడించాలని పోలాండ్ ఇంకా ఉక్రెయిన్ ఇద్దరూ కోరుకుంటున్నట్లుగా ఆయన అన్నాడట. ఎందుకంటే ఉక్రెయిన్ తో రష్యా యుద్ధం అయిపోయిన తర్వాత రష్యా పోలాండ్ పైకి తన డైరెక్షన్ ని మార్చుకుంటుందని భయపడుతుంది పోలాండ్.


అందుకని పోలాండ్ ఇంకా ఉక్రెయిన్ ఇద్దరు కలిసి ఇలా నాటకమాడుతున్నట్లుగా తెలిసింది అమెరికాకి. దాంతో వీళ్ళను తిట్టలేక సైలెంట్ అయిపోయిందట అమెరికా. ఉక్రెయిన్ కు పదేపదే యుద్ధ విమానాలను ఆయుధాలను ఇస్తూ దాన్ని రష్యాపై పురిగొల్పుతున్న పోలాండ్ పై ఇప్పుడు రష్యా ఒక కన్నేసిందని తెలుస్తుంది. దాంతో ఇప్పుడు ఉక్రెయిన్ తో యుద్ధం అయిపోయిన తర్వాత రష్యా ఆ కోపంతో  పోలాండ్  పైకి యుద్ధానికి దిగితే పరిస్థితులు ఇంకెంత ప్రమాదకరంగా ఉంటాయో అని అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: