తేలిపోయిందా?: సింగిల్‌గానే ఎన్నికలకు పవన్?
పవన్ ఆశయాలను, విధానాలను ఇంటింటికీ తీసుకెళ్లడానికి ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు కృషి చేయాల్సిన అవసరం ఉంది. యువత ముఖ్యంగా పవన్ ను సీఎం చేయాలని అనుకుంటే కచ్చితంగా పోరాటం చేయాల్సిందే. పవన్ జనసేన పార్టీ పెట్టి 10 సంవత్సరాలు దాటి పోయింది. పార్టీ నిలబడాలంటే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా గెలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి యువ కార్యకర్తలు, జన సైనికులు, యువత ఎలా స్పందిస్తారనే దానిపైనే పవన్ గెలుపు ఆధారపడి ఉంది.
ప్రస్తుతం పవన్ తన స్పీచ్ లో ప్రతి నియోజకవర్గంలో దాదాపు 500 మంది రూ. 10 లక్షల చొప్పున ఇస్తానని ప్రకటించారు. యువతకు ఉపాధి కల్పించడానికి ఇది ఉపయోగపడుతుందని అన్నారు. ఒక్కో వ్యక్తి రూ. 10 లక్షలతో వ్యాపారం చేస్తే మరో ముగ్గురు, నలుగురు వారి వెనక బాగు పడతారని అనుకుంటున్నారు. కొన్ని మంచి పథకాలను ప్రవేశపెట్టడానికి పవన్ సమాలోచనలు చేస్తున్నారు. వీటిన్నింటిని ఆ పార్టీ కార్యకర్తలు ప్రజల్లో కి తీసుకెళ్లి జనసేన ప్రభుత్వం ఏర్పడితే చేయబోయే పనుల గురించి చెప్పాలి.
పవన్ కల్యాణ్ 2024, 2029 లో రెండు సార్లు గెలిపించాలని కోరుతున్నారు. 10 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారుస్తానని అంటున్నారు. మరి కార్యకర్తలు చేసే కృషి వెనకాల పవన్ విజయం దాగుందన్నది సత్యం. పదేళ్లలో పనులు చేయకపోతే స్వచ్ఛందంగా రాజీనామా చేస్తానని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో పవన్ ప్రభావం ఏ మేరకు ఉండబోతుందనేది చూడాలి.