పవన్‌ అదే మాటపై ఉంటే.. చంద్రబాబుకు చుక్కలే?

పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి చరిష్మాని ఎవరూ తక్కువ అంచనా వేయలేరు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వేలాది మందిని తన వైపుకు ఆకర్షించుకునే క్రౌడ్ పుల్లర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకి పవన్ కళ్యాణ్ తమని ఉద్దేశించి మాట్లాడే మాటలు, ఆయన మాటల్లోని భాష నచ్చకపోవచ్చు. కానీ ఆయన ఫాలోయింగ్ ని తక్కువ అంచనా వేయడం ఎవరూ చేయరు. ఆయన ఎక్కడైనా ప్రసంగానికి వెళ్తే ఆయనను చూడడానికి ప్రత్యేకంగా వేలాదిమంది తమ జేబులో డబ్బులు  ఖర్చు పెట్టి మరీ వస్తారు.


పక్క పార్టీ నాయకులు కూడా వస్తారు. ఆయన వస్తే, ఆయన అధికారంలోకి వస్తే, ముఖ్యమంత్రి అయితే ఒక కొత్త రాజకీయాన్ని చూడగలుగుతామనే ఆశాభావం వ్యక్తం చేసే అభిమానులు, సాధారణ జనం ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నారు. అయితే వాళ్ళ ఆశలు నీరు కారుస్తూ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తు ఖచ్చితంగా ఉంటుందనే విషయం క్లారిటీగా చెప్పారు.


మళ్ళీ ఆ తర్వాత నన్ను ముఖ్యమంత్రిని ఎవరు చేస్తారు, తెలుగుదేశం చేస్తుందా, బీజేపీ చేస్తుందా అని అన్నారు. గతంలో ఓట్లు ఎక్కువ వచ్చుంటే ఈసారి ఆ మాట అనడానికి ఏమైనా బాగుంటుంది అన్నట్లుగా గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన విషయం తెలిసిందే. ఆ మాటలతో పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చూడాలి అని కోరుకున్న వ్యక్తులు నిరుత్సాహపడ్డారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


అయితే తాజాగా మొన్న అదే పవన్ కళ్యాణ్ ప్రజలను ఉద్దేశిస్తూ తనకు ఒక అవకాశం ఇవ్వమని, తనను ముఖ్యమంత్రిగా చేస్తే రాష్ట్రాన్ని బాగు చేసి చూపిస్తానని చెప్పడం జరిగింది. ఆయన అలా అనడంతో ఆయన అభిమానులు ఎంతో సంతోషపడ్డారు. ఆయన మీద ఆశలు పెట్టుకున్న  ప్రజలు కూడా అంతే సంతోష పడ్డారు. అంతేకాకుండా ఈ మాటలకు తెలుగుదేశం పార్టీ వాళ్లయితే షాక్ లో  పడిపోయారని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడైనా ఇదే మాట మీద నిలబడాలని కోరుకుంటున్నారు జనం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: