పవన్‌ వారాహి యాత్ర.. లోకేశ్‌కు షాక్‌ ఇస్తోందా?

పవన్ కళ్యాణ్ వారాహి రథయాత్ర, నిజానికి ఎప్పుడో నారా లోకేష్ యువ గళం పాద యాత్ర కన్నా ముందే మొదలు కావాల్సి ఉంది. అయితే నారా లోకేష్ యువ గళం పాదయాత్ర తాజాగా 100 రోజులు కంప్లీట్ చేసుకుని ముందుకు వెళుతుందని తెలుస్తుంది. ఇప్పటికే రాయలసీమ అంతా కంప్లీట్ చేసుకున్న నారా లోకేష్ పాదయాత్ర నెల్లూరు మీదుగా ఇటు వైపు వేస్తున్నట్లుగా తెలుస్తుంది.

అయితే పవన్ కళ్యాణ్ వారాహి రథాన్ని పూజలు చేసి వరుసగా సినిమా షూటింగులు బిజీతో గతంలో పక్కన పెట్టేసాడు. ఇప్పుడు తన వారాహి పై తిరుగుతూ ప్రసంగాలు ఇస్తున్నాడు. తన రథయాత్ర మొదలుపెట్టిన కొత్తలోనే తెలుగుదేశం పార్టీ వాళ్లకి షాక్  ఇచ్చాడు. అదే టైంలో తన అభిమానులు కోరుకునే విధంగా తనను ముఖ్యమంత్రిగా చేయమని కూడా ప్రజలను కోరాడు.

అయితే మొన్నటి వరకు నారా లోకేష్ పాదయాత్ర గురించి పెద్దగా హైలైట్ చేయని ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు చంద్రబాబు క్లాస్ తో  హైలెట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ వారాహి రథయాత్ర మొదలుపెట్టి జనాల్లోకి రావడంతో ఇప్పుడు ఆ రెండు పత్రికలు పవన్ కళ్యాణ్ ని హైలెట్ చేసే పనులు పడ్డాయని తెలుస్తుంది. దాంతో నారా లోకేష్ వార్తలను సైడ్ ప్లే చేస్తూ, పవన్ కళ్యాణ్ వార్తలను మాత్రం మెయిన్ పేజీలో హైలైట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది.

అయితే ఈ రెండు పత్రికలు తెలుగుదేశానికి సంబంధించిన అనుకూల వర్గం కాబట్టి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం అనే సబ్జెక్టును వదిలేసి, జగన్ ను దింపండి అనే పాయింట్ మాత్రమే హైలెట్ చేస్తూ వస్తున్నారట  తెలివిగా. పవన్ కళ్యాణ్ ప్రచారానికి సంబంధించిన లైవ్ లు కూడా వీళ్లు ఇవ్వడం లేదని తెలుస్తుంది. కానీ మొత్తానికి పవన్ కళ్యాణ్ ప్రచార యాత్ర ఇంపాక్ట్ నారా లోకేష్ పై పడింది అని తెలుస్తుంది. పవన్ రథయాత్ర, లోకేష్ పాదయాత్రను దెబ్బ కొట్టింది అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: