ఆ విషయంలో కేసీఆర్ కంటే జగన్ వెయ్యిరెట్లు బెటర్?
అయినా కూడా చాలామంది తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల్లోనే తమ పిల్లలను చేర్పించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి వాళ్ళ దృష్టిని ప్రభుత్వ పాఠశాలల వైపు మళ్లించడానికి ఒక ఉపాధ్యాయుడు వినూత్న ప్రచారం మొదలుపెట్టినట్లుగా తెలుస్తుంది. ఒక మాస్టర్ గారు బండిమీదన మన కూరగాయలు వాళ్ళు మైకులో వ్యాపార ప్రచారం చేసినట్లుగా అడ్మిషన్ల కోసం ప్రచారం చేస్తున్నట్లుగా తెలుస్తుంది.
మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి. మీ పిల్లలకు బంగారు భవిష్యత్తు ఉంటుంది అని ప్రభుత్వ పాఠశాలల గురించి ప్రజల్లో ఒక అవగాహన కల్పిస్తున్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా రావుల భాస్కరరావు అనే ఉపాధ్యాయుడు పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయమని ఇలా వినూత్నంగా ప్రచారం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో నాడు నేడు కింద స్కూల్స్ అద్భుతంగా బాగుపడ్డాయి అన్న విషయం తెలిసిందే.
చివరికి తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల ముందు క్యూ కడుతున్న పరిస్థితి. సీట్లు లేవని ఆ స్కూళ్ల ముందు బోర్డులు పెడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలు ఈ విధంగా అభివృద్ధి చెందడం అనేది గొప్ప అభ్యున్నతి కింద లెక్క. ఇప్పటివరకు కేసీఆర్ గారు కేజీ టు పేజీ ఉచితం అని చెప్పి ప్రభుత్వ పాఠశాలలను చూపిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఎలాగూ విద్య ఉచితమే. మరి ప్రత్యేకించి స్కూళ్లకు ఆయన చేసిన ఉపకారం ఏముంది అని కొంతమంది తల్లిదండ్రులు అంటున్నట్లుగా తెలుస్తుంది. అయితే జగన్ కి ఆంధ్రాలో ఈ విషయంపై మార్కులు పడుతున్నట్లుగా తెలుస్తుంది.