పాక్‌పై యుద్ధానికి ఇండియా.. అమెరికా పర్మిషన్‌ తీసుకుందా?

భారత్ ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్ మీటింగ్ ఒక సంచలన అంశంపై చర్చ జరిగినట్లు పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ఇమ్రాన్ చేసిన ఆరోపణలను పరిశీలిస్తే పాకిస్థాన్ ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. కనీసం ఆర్మీ వెహికల్స్ లో పెట్రోల్ పోయించడానికి డబ్బుల్లేవు. మరో తాలిబాన్లు, ఇటు అంతర్గతం కొన్ని ఆర్థిక సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయి.


చైనా అప్పులు ఇవ్వడం లేదు. గోధుమ పిండి కూడా దొరకడం లేదు. అరబ్ దేశాలు ఆదుకోవడం లేదని, అప్పులతో ఏం చేయాలో తోచని పరిస్థితి ఉందని దీని వల్ల ఈ సమయంలో పాకిస్థాన్ ఆక్రమితి కాశ్మీర్ పై దాడి చేసి దాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేస్తామని దాన్ని మీరు అడ్డుకోవద్దని మోదీ బైడెన్ ను కోరినట్లు పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలు చేస్తున్నారు.


దీనికి భారత్ రష్యా నుంచి కాకుండా అమెరికా నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తుందని, పూర్తిగా అమెరికా సాయం తీసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదని చర్చలు జరిగినట్లు ఆరోపిస్తున్నారు. పాక్ కు ప్రస్తుతం యుద్ధం చేసేంత సామర్థ్యం లేదని ఇప్పుడు దాడి చేస్తే ఆక్రమిత కాశ్మీర్ ను తిరిగి స్వాధీనం చేసుకోవచ్చని మోదీ అమెరికా సాయం కోరడాని ఇమ్రాన్ ఖాన్ అంటున్నారు. కానీ బైడెన్, మోదీల సమావేశంలో ఈ విషయం చర్చకు రాలేదని తెలుస్తోంది.


ఇవన్నీ ఇమ్రాన్ ఖాన్ మళ్లీ పాకిస్థాన్ కు ప్రధాని కావాలని భావిస్తున్నారు. కావాలనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కొంతమంది అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భారత్ లోని కొంతమంది కూడా అదే జరిగితే బాగుండేది సరైన సమయం కదా అని ఇప్పుడు స్వాధీనం చేసుకుంటే మంచిదని అంటున్నారు. కానీ యుద్దంలోకి దిగితే అది ఎటువైపు వెళ్లి ఎక్కడ ఆగుతుందో ఎవరికీ తెలియదు. కాబట్టి భారత్ ఆచితూచి స్పందిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: