పవన్‌ కల్యాణ్‌.. కులాల లెక్కలెందుకు?

పవన్ వారాహి యాత్ర కొనసాగుతోంది. ఎక్కడికి వెళ్లినా ఆయనకు అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. కానీ పవన్ స్పీచ్ లో కాస్త క్లారిటీ లోపించింది. గతంలో రెండు సామాజిక వర్గాలే ఆంధ్రప్రదేశ్ ను ఎక్కువ కాలం పాటు పాలించాయని విమర్శలు చేశారు. అయితే  చంద్రబాబు, జగన్ ఇద్దరు కుల రాజకీయాలు మాట్లాడేటపుడు చాలా జాగ్రత్తగా ఆచి తూచి మాట్లాడతారు.


కానీ డైరెక్టుగా ఏ కులానికి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు లేవు. మాట్లాడే సాహసం కూడా చేయరు.  రాజకీయ నాయకులకు ఉండాల్సిన పరిపక్వత వారిలో ఎక్కువగా ఉంటుంది. కానీ జనసేన అధినేత కుల రాజకీయాల గురించి మాట్లాడుతూ..  జగన్ రెడ్డి అంటూ సంబోధించడం చాలా మంది రెడ్లకు రుచించడం లేదు.


కాపు నేత ముద్రగత పద్మనాభం చాలా ఏళ్లుగా కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలని పోరాటం చేస్తున్న వ్యక్తి.  ఈ మధ్య పవన్ కల్యాణ్ ను విమర్శించారు. దీంతో ఆయన కాపుల్లోనే విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారని బహిరంగంగానే విమర్శించారు.  ఇక్కడ విడదీసే వారు ఎప్పటికీ నాయకుడు కాలేరు. కలిపే వారు మాత్రమే అవుతారని పవన్ కల్యాన్ ముద్రగడను ఉద్దేశించి వ్యాఖ్యనించారు.


లీడర్లకు స్పష్టత ఉండాాలి. ఆ స్పష్టత లేకపోతే రాజకీయాల్లో ఎదగరు. నాయకులు పవర్ పుల్ గా తయారు అయితే ఆయన సామాజిక వర్గం గురించి ప్రజలు ఆలోచించరు. వారు చేసిన  అభివృద్ధిని మాత్రమే చూస్తారు. చంద్రబాబు, జగన్ వారి కులాల వారిని ఓట్లు వేయమని ఎప్పుడు అడగరు. కానీ వారికి అనుకూలంగా వారి కులస్థులు ఓట్లు వేస్తూనే ఉంటారు. ఆ నమ్మకం వారి సామాజిక వర్గంలో ఉంటుంది.  అయితే రెండు కులాల ఆధిపత్యం నుంచి రాష్ట్రాన్ని కాపాడదాం ఈ సారి కాపులకు అవకాశం ఇవ్వాలని గతంలో పవన్ స్పీచ్ ల్లో చెప్పిన విషయం తెలిసిందే.  అయితే ముద్రగడ కాపులను విడదీసే నాయకుడని ప్రొజెక్టు చేసే విధంగా పవన్ స్పీచ్ ఉంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: