చంద్రబాబుకు.. పవన్‌ సత్తా తెలిసొచ్చిందా?

పవన్ కళ్యాణ్ సత్తా చంద్రబాబు నాయుడుకి తెలుసు. గతంలో ప్రజారాజ్యం పార్టీ వచ్చినప్పుడు గోదావరి జిల్లాలో ఆ పార్టీ చాలా వరకు ఓట్లను చీల్చింది. టీడీపీ అధికారంలోకి రాకుండా చేయడంలో కీలకపాత్ర పోషించింది. అప్పుడు పవన్ కళ్యాణ్ యువరాజ్యం అధినేతగా ఉండి అన్నీ తానై ముందుండి నడిపించాడు.


ప్రస్తుతం చంద్రబాబు ఏ విషయం మాట్లాడిన ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఓ సెక్షన్‌ మీడియా అదొక ఆణిముత్యంలా చూపించడం అలవాటైపోయింది. ముఖ్యంగా టీడీపీకి అనుకూల మీడియా ఇలా చేస్తోందని జగన్ ముందు నుంచి ఆరోపిస్తున్నారు. డైరెక్టుగా ఆ సంస్థల పేర్లు చెబుతూనే అవి టీడీపీకి అనుకూల మీడియా అని ఎన్నోసార్లు విమర్శించారు.


పవన్ కళ్యాణ్ ప్రస్తుతం గోదావరి జిల్లాలో వారాహి యాత్ర మొదలెట్టారు. గోదావరి జిల్లాలో ముందు నుంచి కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉండటం, పవన్ కళ్యాణ్ కూడా ఆ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం వల్ల ఆయన సమావేశాలకు సభలకు ఎక్కువ మంది హాజరవుతున్నారు.  అది కూడా స్వచ్ఛందంగా ముందుకు రావడంతో సభలు సక్సెస్ గా  నడుస్తున్నాయి. ఇన్ని రోజులు లోకేష్ పాదయాత్రకు ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చినటువంటి తెలుగు దేశం అనుకూల మీడియా ప్రస్తుతం తప్పక పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను చూపించాల్సి వస్తుంది.


టీడీపీ పవన్ కళ్యాణ్ ని తక్కువ అంచనా వేద్దామా అని అనుకుంటే పొరపాటు చేసిన వారమైతామని చంద్ర బాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గోదావరి జిల్లాలో టీడీపీ మూడో స్థానానికి వెళ్లిపోయే అవకాశం ఉన్నట్టు జనసేన వైసీపీ మధ్య పోటీ పోటీ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ ని ఏ సమయంలో కూడా విమర్శించడం కానీ తన అనుకూల మీడియాతో వ్యతిరేకంగా వార్తలు రాయించడం కానీ చేయడం లేదు. లోకేశ్ పాద యాత్ర కంటే పవన్ కే ఎక్కువ గా కవరేజీ ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: