మళ్లీ 'అమరావతి'నే నమ్ముకుంటున్న బాబు?

రాబోయే తొమ్మిది నెలల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగనున్నాయి. కానీ ఇప్పుడే ఎన్నికల ప్లాన్ అమలవుతున్నట్లు తెలుస్తోంది. తెలుగు దేశం పార్టీ అజెండా ఏమిటి? సంక్షేమ పథకాలను ఏమేం ప్రవేశపెడతామని చెప్పాలి. వైసీపీ ఇస్తున్న పథకాలు, తెలంగాణ ఇస్తున్న పథకాలను అన్నింటిని కలిపి సరికొత్తగా వారి కంటే ఎక్కువగానే ఇస్తామని టీడీపీ చెబుతున్నా... అది ప్రజల్లో కి తీసుకెళ్లడంలో మాత్రం సక్సెస్ కాలేకపోతున్నారు.


జగన్ గతేడాది జరిగిన ఎన్నికల్లో కేవలం నవరత్నాలు ఇస్తానన్న హామీతో నే గెలిచారు. కానీ అంతకుమించి ఇస్తామని టీడీపీ చెబుతున్నా దాన్ని ప్రజలు పెద్దగా పట్టించుకోనట్లే కనిపిస్తున్నారు. ఇలా అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవడం కష్టమనే భావన ఆ పార్టీ నాయకుల్లో వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే ప్రపంచ స్థాయి రాజధాని నగరంగా అమరావతిని తీర్చి దిద్దాలని దానికి సమర్థుడైన చంద్రబాబు నాయుడే సరైన వాడని మళ్లీ ప్రచారం మొదలెట్టారు.


బాబు అంటే రాజధాని, రాజధాని అంటే బాబు అనేలా చెబుతున్నారు. అమరావతి సెంటిమెంట్ తో 200 రోజుల కార్యాచరణ చేపట్టాలని ప్లాన్ వేశారు. మొత్తం అమరావతికే దోచి పెడతారని ఉత్తరాంద్ర నుంచి వచ్చిన  విమర్శలు నేపథ్యంలో, అమరావతి పైనే పూర్తి దృష్టి కేంద్రీకరిస్తే కృష్ణా, గుంటూరుల పరిస్థితి ఏం కావాలని అక్కడి ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈ వ్యతిరేకతే 2019 లో అధికారానికి దూరం చేసిందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.


కానీ సంక్షేమ పథకాల అమలు విషయంలో ఎక్కడా లోపం లేకుండా చెబుతున్నా  ఏ మాత్రం పట్టించుకోవడం లేదని తెలిసి రూటు మార్చారు టీడీపీ నాయకులు. హైటెక్ సిటీ అంటే చంద్రబాబు గుర్తొస్తారు. ఇప్పుడు అమరావతి అంటే చంద్రబాబే గుర్తుకురావాలని దాని కోసమే మా కృషి అని టీడీపీ చెబుతోంది. మరి అమరావతి రాజధాని నినాదం బాబును గట్టెక్కిస్తుందా? విజయ తీరాలకు చేర్చుతుందా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: