ప్రపంచం గుండెలపై ఫ్రాన్స్ అణుబాంబుల కుంపటి?
యూరప్ దేశాలకే అణు ముప్పు ఉందని రష్యా హెచ్చరిస్తోంది. ఫ్రాన్స్ లో అల్లర్లు జరుగుతున్నాయి. ఆరు రోజులుగా విధ్వంస కాండ కొనసాగుతుంది. ఎక్కడికక్కడ ఆందోళకారులు లూటీ చేస్తున్నారు. దొంగతనాలు చేస్తున్నారు. కార్లను ఎత్తుకెళుతున్నారు. ఇలా ఎన్నో రకాల విధ్వంసాలు ఫ్రాన్స్ లో జరుగుతున్న ప్రభుత్వం సైన్యం చేష్టలూడిగి చూస్తుందని రష్యా ఆరోపించింది.
రష్యా లో కూడా తిరుగుబాటు జరిగితే రెండు రోజల లోపే దాన్ని పుతిన్ సైన్యం అణిచివేసింది. వ్యాగనర్ బృందం తిరుగుబాటు దారులను పుతిన్ తొందరగా అణిచి వేశారు. ఫ్రాన్స్ లో ప్రస్తుతం జరుగుతున్న విధ్వంసం వల్ల జరగబోయే పరిణామాలు భయానకం కలిగిస్తున్నాయి. అసలు ఫ్రాన్స్ లో అణ్వాయుధాలు క్షేమంగానే ఉన్నాయా? విధ్వంసకారుల చేతిలోకి వెళ్లిపోయాయేమని రష్యా ఆందోళన హెచ్చరిస్తోంది.
రష్యా మాత్రం యుద్ధం విషయంలో ఎక్కడ కూడా తగ్గడం లేదు. ఎన్ని యూరప్ దేశాలు, ప్రైవేటు సైన్యం కూడా దాడి చేస్తున్న దీటుగా ఎదుర్కొంటోంది. కానీ ఫ్రాన్స్ విషయంలో అలా జరగడం లేదు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యువేల్ మెక్రాన్ సరైన విధంగా అల్లర్లను అణిచి వేయడం లేదని ప్రపంచ మేధావులు ఆరోపిస్తున్నారు. అయితే రష్యా, ఫ్రాన్స్ విషయంలో చెప్పినవి నిజం అయితే అణ్వాయుధాలు అల్లర్ల మూక చేతిలోకి వెళ్లిపోతే జరగబోయే విధ్వంసం చాలా భయానకంగా ఉంటుంది. కాబట్టి ఫ్రాన్స్ వీలైనంత తొందరగా అల్లర్లను అణిచి వేసి రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.