యూనిఫామ్ సివిల్ కోడ్.. చర్చ జరగాల్సిందే?
ఒక్కొక్కరు ఒక్కో రకంగా వార్తలు రాస్తుంటారు. ఒకప్పుడు జర్నలిజం అంటే పేదలకు న్యాయం జరిగేలా.. అవినీతిని ఓడించేలా వార్తలు ప్రచురించేవారు. ఇప్పుడు డబ్బులు ఉంటే చాలు ఎవరి వార్తలు వారు డబ్బా కొట్టుకుంటున్నారు. నిజాల్ని దాస్తున్నారు. అబద్ధాల్ని ప్రచారం చేస్తున్నారు. అబద్ధాన్ని నిజంగా చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక్కరు కూడా ప్రజలకు పనికి వచ్చే వార్త సమాచారాన్ని ఇవ్వడం లేదు. ప్రజా ప్రతినిధులను వేలేత్తి ప్రశ్నించడం మానేశారు.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ) తీసుకురావాలని భావిస్తోంది. దీనిపై రెండు తెలుగు రాష్ట్రాల్లోని బీఆర్ఎస్, వైసీపీ, టీడీపీ, జనసేన, లాంటి ప్రాంతీయ పార్టీల అభిప్రాయాలను ఎందుకు ప్రశ్నించడం లేదు. యూసీసీ మీరు అనుకూలమా? వ్యతిరేకమా.. దేశంలో ఒకే విధానం, ఒకే నినాదంతో యూసీసీ తో ముందుకెళ్లిన కేంద్ర భావిస్తుంటే ముస్లింలకు ఎందుకు నష్టం జరుగుతుంది అని మీడియా ఏ ఒక్క పార్టీ నాయకులను ప్రశ్నించడం లేదు.
సివిల్ కోడ్ రావడం వల్ల దేశంలో అందరికీ ఒకే చట్టం వర్తిస్తుంది. దీని వల్ల ముస్లింలకు ఒక చట్టం, హిందువులకు మరో చట్టం వర్తించదు. అందరూ రాజ్యాంగం ప్రకారం.. సమానంగా హక్కులు పొందుతున్నప్పుడు సివిల్ కోడ్ తో వచ్చిన ఇబ్బందేమిటని ఏ మీడియా సంస్థ కూడా ప్రశ్నించడం లేదు. ప్రాంతీయ పార్టీల అధినేతలు పవన్, కేసీఆర్, జగన్, చంద్రబాబు సివిల్ కోడ్ కు అనుకూలంగా ఉంటారా? లేక వ్యతిరేకిస్తారా అనే ప్రశ్నలు కూడా అడగాటానికి ఇబ్బంది పడే జర్నలిస్టులు తయారయ్యారు.