రేవంత్ రెడ్డీ.. ఆ హామీ అంత ఈజీ కాదు?
కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్ ని 4000 రూపాయలకు పెంచుతానని చెప్పింది. కాబట్టి కెసిఆర్ కూడా ఇప్పుడు కాంగ్రెస్ చెప్పిన హామీల దారిలోనే నడవవలసి ఉంటుంది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వైయస్ జగన్ కూడా వృద్ధాప్య పింఛన్ విషయంలో వాళ్ల తీరునే అవలంబించాల్సి వస్తుంది. ఇప్పటికే తాను అధికారంలోకి వచ్చిన రోజు నుండి ఏడాదికి 250 రూపాయలు చొప్పున పెంచుకుంటూ వెళ్తానన్నాడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి.
ఆయన ఆ మాట మీద నిలబడి 2000రూపాయలు ఉన్న వృద్ధాప్య పెన్షన్ ను ఇప్పుడు 2,750రూపాయలకు పెంచిన విషయం తెలిసిందే. ఈ వృద్ధాప్య పెన్షన్ అనేది ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత వృద్ధుల జీవితాలలోకి ఒక కొత్త ఆశ, భరోసా వచ్చినట్లుగా తెలుస్తుంది. వాళ్లకి గుర్తింపు, అలాగే గౌరవం కూడా ఈ పెన్షన్ వల్ల పెరిగాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. గతంలో వృద్ధులు అంటేనే కొత్తగా వచ్చిన కోడళ్ళు మాత్రమే కాకుండా కన్న కొడుకులు కూడా చిన్న చూపు చూసేవారు. తగని బరువుగా భావించే వారు. ఇక వాళ్లతో పాటే వారి మనుమలు, మనవరాళ్ళు పద్ధతి కూడా ఉండేది.
అలాంటి సమయంలో, సందర్భంలో వాళ్ల జీవితాలలోకి వృద్ధాప్య పింఛన్ అనేది వెలుగులు తీసుకు వచ్చింది. ఇప్పుడు వాళ్లు తమ ఆరోగ్య ఖర్చులకు కొంత కేటాయించుకుని మిగిలినది తమ కోడళ్ళకు, కొడుకులకు మనుమలకు, మనవరాళ్లకు ఉన్న దాని నుండే ఇస్తున్నారు. ఎంతో కొంత విలువగా బ్రతుకుతున్నారు. ఇప్పుడు పెరుగుతుంది అంటున్న 4000 రూపాయలు పింఛను వృద్ధులకు నిజంగా వరమే.