తెలంగాణ రాజకీయాల్లో భలే మంచి పరిణామం?
ఈమధ్య బండి సంజయ్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త ఇంటిలోని ఒక ఫంక్షన్ కి వెళ్లారు. అయితే అక్కడ అనుకోకుండా కవిత కనిపించిందట. సాధారణంగా వీళ్ళు ఇద్దరు రాజకీయ సభల పైన అయితే ఒకరిపై ఒకళ్ళు రాళ్ళు విసురుకుంటూ ఉంటారు. కానీ ఆ ఫంక్షన్ లో మాత్రం బండి సంజయ్ ఇంకా కవిత ఎటువంటి రాజకీయ ద్వేషాలు లేకుండా ఎంతో గౌరవంగా పలకరించుకున్నారు.
అలాగే ఈటెల రాజేందర్ కు జెడ్ సెక్యూరిటీ ఏర్పాటు చేయడం అనే విషయంలో కేటీఆర్ ప్రత్యేకంగా పర్యవేక్షించి మరి సెక్యూరిటీని ఏర్పాటు చేశారని తెలుస్తుంది. అలాగని కేటీఆర్ కు ఈటల రాజేందర్ కు మధ్య అంత బలమైన బాండింగ్ ఉందా అంటే లేదని తెలుస్తుంది. అయితే తెలంగాణకు సంబంధించిన మంత్రి ప్రశాంత్ కుమార్ ఈటెల రాజేందర్, రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఒక హోటల్లో మాట్లాడుకున్నారని అంటున్నాడు.
అనుకోకుండా ఇద్దరూ ఒకే చోట కలిసినందుకు ఒకవేళ ఇద్దరు సరదాగా కూర్చుని మాట్లాడుకుని ఉండవచ్చు కదా అని కొంతమంది అంటున్నారు. అయితే అలాంటి క్యాజువల్ చిట్ చాట్ ని కూడా ప్రశాంత్ కుమార్ అనే వ్యక్తి ఎందుకంత హాట్ టాపిక్ గా మార్చేస్తున్నారు అని కొంతమంది అడుగుతున్నారు. కర్ణాటకలో గెలుపొందిన కాంగ్రెస్ ని తెలంగాణలో ఎలా ఓడించాలా అని టీఆర్ఎస్ భావిస్తుందేమోనని మరి కొంతమంది వాదిస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది కాబట్టి తెలంగాణలో కూడా గెలుస్తుందని ఎలా అనుకుంటారు ఇదంతా కాంగ్రెస్ ఆడే డ్రామా అంటున్నారు కొంతమంది.