మోదీ వలలో పడేది ఎవరు.. జగనా? చంద్రబాబా?
అమిత్ షా అధ్యక్షుడుగా ఉన్నటువంటి ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఇప్పుడు కొత్త రాజకీయ వ్యూహాలను రచిస్తున్నట్లుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్ లోని రెండు బలమైన పార్టీలైనటువంటి తెలుగుదేశం ఇంకా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల మీద తన దృష్టిని కేంద్రీకరించిందని తెలుస్తుంది. ఆల్రెడీ ఎన్డీఏ అధిష్టానం నుండి తెలుగు దేశం ఇంకా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలకు పిలుపు వెళ్ళినట్లుగా తెలుస్తుంది.
తమతో ఈ రెండు పార్టీలను చేతులు కలపమని ఆ పిలుపులోని సారాంశం అని తెలుస్తుంది. అయితే భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన రిపబ్లిక్ టీవీ ఇప్పుడు ఈ విషయాన్ని చెప్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇదే విషయాన్ని వైఎస్ఆర్సిపి కి చెందిన విజయ సాయి రెడ్డిని ఒక నేషనల్ మీడియా అడిగిందట. దానికి విజయ సాయి రెడ్డి ఎన్డీఏ నుండి అసలు మాకు ఎటువంటి పిలుపు రాలేదు అంటూ సమాధానం ఇచ్చారట.
అసలు జగన్ మోహన్ రెడ్డి ఎన్డీఏలో చేరడం అనేది జరగదని తెలుస్తుంది. కావాలంటే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి తాను మద్దతు ఇస్తాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ మోహన్ రెడ్డి ఎన్డీఏ లో చేరడం మాత్రం అసాధ్యం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయినా విజయసాయిరెడ్డి మేము ఎన్డీఏ తో కలవము అని చెప్పాలి కానీ మాకు ఎన్డీఏ నుండి అసలు పిలుపే రాలేదు అని ఎలా చెప్తారు అని అడుగుతున్నారు కొంత మంది.
ఎన్డీఏతో అంటే భారతీయ జనతా పార్టీతో ఇప్పుడు వైయస్సార్సీపి ఒక విషయం చెబుతున్నట్లుగా తెలుస్తుంది. అదేమిటంటే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవద్దని చెప్తుందట. ఎందుకంటే గతంలో కూడా తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని వాడుకుని రెండు సార్లు ఎన్నికల్లో గెలిచింది. ఆ తర్వాత తనను గెలిపించిన మిమ్మల్ని తొక్కేసింది. అలాంటి తెలుగుదేశం పార్టీతో కలిసి మీరు ముందుకు వెళ్ళద్దు అని డైరెక్ట్ గా చెప్తుందట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.