అపనమ్మకంలో పవన్‌.. ఇంతలోనే ఏమైంది?

వారాహి రధ యాత్రలో పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ మళ్ళీ తన మాట మార్చుకున్నారు. అంటే ఆవేశంగా మాట్లాడడం, మనల్ని ఎవడ్రా ఆపేది అన్నట్లు మాట్లాడడం అదంతా కామన్. అసలు పవన్ కళ్యాణ్ స్టైలే అది. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు మార్చుకున్నది ఆ స్టైల్ ని కాదు. గతంలో గోదావరి జిల్లాలో పర్యటించినప్పుడు జనసేనకి ఒకసారి అధికారం ఇవ్వమని కోరిన విషయం తెలిసిందే. అలా ఒకసారి అధికారం ఇస్తే తాను అంటే ఏంటో చూపిస్తాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ మాట ఇప్పుడు మారింది.


తాజాగా ఆయన ఏమంటున్నారు అంటే పోరాటం చేస్తే విజయం సాధిస్తామో లేదో తెలియదు కానీ పోరాటం చేద్దాం అని అంటున్నట్లు సమాచారం. అయితే మిగిలిన పార్టీలు ఏవి కూడా ఇలా మాట్లాడడం లేదని సమాచారం. భారతీయ జనతా పార్టీ కూడా కాన్ఫిడెంట్ గానే ఉంది. అలాగే కమ్యూనిస్టులు కూడా అదే విధంగా అనుకుంటూ ముందుకు వెళుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఇలా పోరాడినా విజయం వస్తుందో రాదో తెలీదు అని మాట్లాడుతున్న మాటలు వల్ల సొంత పార్టీ శ్రేణుల్లోనే అప నమ్మకం కలిగిస్తున్నారని కొందరు అంటున్నారు.


అలా తనకు అధికారం ఇవ్వండి అని మొదలుపెట్టిన పవన్ ఇప్పుడు తన ప్రసంగాలలో వైసీపీ ప్రభుత్వాన్ని దించేయాలి అంటూ మాట్లాడుతున్నట్టుగా సమాచారం. ఒకవైపు వైసీపీ విధానాలను విమర్శిస్తూనే, మరోవైపు వాలంటీర్ వ్యవస్థను కూడా పవన్ కళ్యాణ్  విమర్శిస్తుండడం జరుగుతుంది.  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఆర్థిక పరమైన ఆరోపణలు చేస్తే అది వైసిపి అలాగే జనసేన మద్యలో వివాద అంశంగా ఉంటుంది.


వాలంటీర్ వ్యవస్థను విమర్శించడం అనేది ఇంకొక భిన్నమైన అంశం. గతంలో తాను అధికారంలోకి వస్తే ప్రతి నియోజకవర్గానికి 500 మందికి పది లక్షలు ఇస్తానని, గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తానని చెప్పిన ఆయన పోరాడితే నెగ్గుతామో లేదో తెలియదు అని ఎలా అంటున్నారు అని కొంతమంది అడుగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: