రేవంత్‌ ఆ మాట వెనుక.. అంత వ్యూహం ఉందా?

కాంగ్రెస్ సీఎంగా రేవంత్ రెడ్డిని ప్రకటించడానికి అధిష్టానం సిద్ధంగా లేదు. ఎందుకంటే జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భట్టి విక్రమార్క లాంటి సీనియర్లు ఉండగా డైరెక్టుగా రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రకటించే సాహసం చేయకపోవచ్చు. కర్ణాటకలో కూడా ఇలాగే సిద్ధరామయ్య, డికె శివకుమార్ మధ్య తీవ్ర పోటీ నెలకొన్నా.. చివరకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధ రామయ్య వైపు మొగ్గు చూపింది. సిద్ధ రామయ్యకు క్షేత్ర స్థాయిలో బలం ఉండటం ఆయనకు కలిసొచ్చింది.


ఇలాంటి దశలో తెలంగాణలో కాంగ్రెస్ గనక గెలిస్తే తనకు సీఎం పదవి రాకపోతే తనతో పాటు తెలుగుదేశం నుంచి వచ్చిన సీతక్కను సీఎం చేయాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు. ఈ సందర్భంగా నే అమెరికాలోని తానా సభలకు వెళ్లిన సందర్భంగా అవసరమైతే సీతక్కను కాంగ్రెస్ నుంచి సీఎం చేస్తామని ప్రకటించారు. దీనిపై కాంగ్రెస్ లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


ఎందుకంటే ఎస్సీ కాంగ్రెస్ క్యాండిడేట్ కింద భట్టి విక్రమార్క సీఎం పదవి రేసులో ముందున్నారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి, జగ్గా రెడ్డి లాంటి నేతలు సీఎం పదవి రేసులో ఉండడం గమనార్హం. వీళ్లందరు కూడా సీఎం పదవి గురించి గొడవ పడే బదులు మధ్యే మార్గంగా సీఎం క్యాండిడేట్ ను ఊహించని వ్యక్తి పేరు చెప్పి అందరికీ రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చారు.


ఎస్సీల నుంచి భట్టి విక్రమార్క కూడా తన వ్యుహాలు తాను వేసుకుంటున్నారు. ఎలాగైనా తెలంగాణలో సీఎం కావాలని పట్టుదలతో ఉన్నారు. దీని కోసం మొన్నటి వరకు పాదయాత్ర కూడా చేశారు. భట్టికి చెక్ పెట్టాలని పొంగులేటిని తెచ్చిన రేవంత్ ఆయన కూడా భట్టి తో కలిసిపోవడంతో చివరకు సీతక్క పేరును సీఎం పదవి గురించి ఎత్తాల్సి వచ్చిందని తెలుస్తోంది. ఏదేమైనా కాంగ్రెస్ గెలవకుండానే సీఎం పదవి గురించి కొట్టుకుంటున్నారనే చర్చ నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: