చంద్రబాబు కొత్త ప్లాన్.. వర్కవుట్ అవుతుందా?
పెరిగిన ధరలతో రూ. 150 కి పని చేయాలంటే ఎవరి వల్ల కాదు. ఎందుకంటే తాపీ పనిలో మహిళ కూలీలకు రోజుకు రూ.700 వస్తున్నాయి. ఒక్క పూట పనికైతే రూ. 400 తీసుకుంటున్నారు. మినిమం రూ. 500 కే కూలీ వస్తున్నారు. ప్లంబర్ రూ. 1000 కే పని చేస్తున్నారు. ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యం అంటూ రూ. 150 అంటే ఎవరూ నమ్మే పరిస్థితిలో లేదు.
అయితే చంద్రబాాబు నాయుడు తీసుకొస్తున్న పూర్ టు రిచ్ అనే దాంట్లో చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంపదను ఎలా సృష్టిస్తారు. పేదవారికి ఎలాంటి పనులు చెబుతారు. రూ. 150 తో ధనికులు అయిపోతారా? రోజు రూ. 150 ఇచ్చిన కేవలం నెలకు రూ. 4500 అవుతాయి. కానీ కూలీ పనికి వెళ్లే వారికి రోజుకు 500 చొప్పున నెలకు రూ. 15 వేలు వస్తాయి. కానీ ఇలాంటి హామీల వల్లనే 2009లో బొక్క బోర్లా పడ్డారు.
2014 లో రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ అనేది ప్రజల్లోకి వెళ్లడంతో గెలిచారు. ప్రజలకు అర్థమయ్యే పథకాలు వారికి ఉపయోగపడే విధంగా పెడితే వారికి నచ్చుతుంది. కానీ పూర్ టు రిచ్ అని రూ. 150 ఇస్తానంటే ఓటు వేరే వారు కూడా వేయరు.