హిందూమతం గొప్పదనం.. ఇతరులకు చులకన అవుతుందా?

మన దేశ సంస్కృతి సంప్రదాయాలు ఎంత పురాతనమైనవో అంత గొప్పవి కూడా. అయితే అంతా గొప్ప సంస్కృతి సంప్రదాయాలను నేల రాయడానికి అనేక మంది విదేశీయులు మన భారతదేశం పై అనేక సార్లు దాడులు చేశారు. ఈ దాడులలో అనేక మంది తన దేశాన్ని రక్షించుకోవడం కోసం ప్రాణాలర్పించారు. అయితే ఈ క్రమంలో 7 జాతులు కాలగర్భంలో కలిసి పోయాయని, మరో 15 జాతులు తమ ధర్మాన్ని, మతాన్ని వదిలేసి వేరే మతంలోకి వీరి ప్రభావంతో మారిపోయాయని సమాచారం.


మన దేశంలో మెజార్టీ వర్గానికి సంబంధించిన ప్రజలు  హిందూ మత విధానాన్ని అనుసరిస్తూ ఉంటారు. హిందూ మతాన్ని అవలంబించేవాళ్లు పొరుగు వారిని తమ మతంలోకి రమ్మని బలవంతం చేయరు. దేవుడిని ఏ రూపంలో నైనా కొలుచుకోవచ్చని వాళ్ల విశ్వాసం. ఆ కారణం మీదనే, ఆ భావన మీదనే తమకు తాముగా వేరే మతం లోకి మారరు. అలాగే ప్రక్క మతాల వాళ్ళని తమ మతాన్ని అవలంబించమని కూడా అడగరు.


ఏ మతాన్ని దూషించకపోవడం, ఏ మతాన్ని ద్వేషించకపోవడం అనేది హిందు ధర్మం యొక్క గొప్ప సంస్కారం. అయితే అలాంటి హిందూ మత ధర్మం గురించి  మన తర్వాతి తరాల వారికి మనం చెప్పడం లేదు. మన దేశ లక్షణం గురించి, అలాగే మన దేశ సామర్థ్యం గురించి కూడా  తర్వాత తరాల వారికి తెలియడం లేదు. గతంలో మన హిందూ ధర్మాన్ని, మన సంప్రదాయాలను పక్క మతాల వాళ్ళు  హేళన చేసే వారు.


మన వస్త్రధారణను, మన అలంకారాలను హేళన చేసేవారు. దాంతో మనం మన మంచి విధానాలను కూడా మార్చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు మనలో చాలామంది గతంలో మాదిరి తరచుగా ఆలయాలకి వెళ్లడం కూడా మానేశారు వీళ్ళ ప్రభావంతో. కానీ ఇలా హేళన చేసిన కొంత మంది మాత్రం శుక్రవారం మసీదుకు, ఆదివారం చర్చిలకు క్రమం తప్పకుండా వెళ్తున్నారు అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: