వలసలతో జనసేన కళకళ.. టీడీపీకి దెబ్బేనా?

జనసేన పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. ఆమంచి సోదరులు జనసేనలోకి రావడానికి సిద్ధమవుతున్నారు. చీరాలకు టికెట్ అడుగుతున్నారని కొందరు.. గిద్దలూరు అడుగుతున్నారని మరి కొందరు ప్రచారం చేస్తున్నారు. చీరాల వరకు అయితే ఆమంచి కృష్ణమోహన్ ఓకే అన్నట్లు తెలుస్తోంది. పంచికర్ల రమేశ్ విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా చేశారు.


ఆ తర్వాత ఆయన వైసీపీలో చేరారు. కానీ వైవీ సుబ్బారెడ్డితో గొడవల కారణంగా ఆ పార్టీలో ఆయన ఉండలేకపోయారు. ఇప్పుడు పంచికర్ల రమేశ్ జనసేనలో చేరారు. విశాఖ సిటీ నుంచే పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. జనసేన నుంచి ప్రస్తుతం చూస్తే దాదాపు 10 మంది వరకు గెలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్, నాగబాబు, సందీప్, పంచికర్ల రమేశ్, బొలిశెట్టి శ్రీనివాసరావు, తూ.గో జిల్లాలో జనసేన అధ్యక్షుడు ఇలా దాదాపు 10 మందికి పైగా జనసేన నుంచి గెలిచే అభ్యర్థులు కనిపిస్తున్నారు.


పవన్ కల్యాణ్ కూడా ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి ప్రాధాన్యతనిస్తూ జనసేనను బలోపేతం చేయడానికి కృషి చేస్తే రాబోయే రోజుల్లో మరింత బలంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో జనసేనకు ఒక్క సీటు మాత్రమే వచ్చిన దాదాపు ఆరు శాతం ఓట్లు వచ్చాయి. కానీ ఈ సారి పవన్ కల్యాణ్ గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు.


ఎలాగైనా జగన్ ను సీఎం పదవి నుంచి దించేయాలని పట్టుదలగా ఉన్నారు. ఇలాంటి సమయంలో పవన్ వివాదాస్పద వ్యాఖ్యల జోలికి వెళ్లకుండా పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రయత్నం చేయాలి. ప్రజల్లోకి పార్టీకి తీసుకెళ్లి అధికారంలోకి వస్తే ఏమేం చేస్తారో చెప్పగలగాలి. ఇలా చెప్పినపుడే అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. ఏపీలో జనసేన అధికారంలోకి రావడం అంత ఈజీ కాదు. ఒక వైపు అధికార వైసీపీ, మరో వైపు సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు టీడీపీ ఈ రెండింటి మధ్య జనసేనకు టప్ ఫైట్ తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: