బండి సంజయ్‌కు అన్యాయం చేసింది ఎవరో?

గతంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు ఎవరు సాధించని విజయాలు ఒక్క బండి సంజయ్ టైంలోనే సాధ్యం అయ్యాయని అంటున్నారు. కానీ అలాంటి బండి సంజయ్ ప్రస్తుతం పదవిని కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. అది కూడా తమ పార్టీలోని వ్యక్తులు చేసిన ఫిర్యాదుల వల్లే ఆయన పదవిని కోల్పోయారని సమాచారం. దీనిపై బండి సంజయ్ తన ఆవేదనను కిషన్ రెడ్డి బాధ్యతలు చేపడుతున్న సమయంలో వ్యక్తం చేయడం జరిగింది.


ఆ సందర్భంగా బండి సంజయ్ కోరింది ఏమిటంటే తనపై ఎవరు ఫిర్యాదు చేశారో తనకు తెలియదని, కనీసం కిషన్ రెడ్డి పైన అయినా ఇకపై ఫిర్యాదులు చేయకండి అని అన్నారు. అయితే ఆల్రెడీ అదే సమావేశంలో ఉన్న ఈటెల రాజేందర్ అలాగే కోమటి రెడ్డిలు కూడా గతంలో బండి సంజయ్ పై కంప్లైంట్ చేసిన వాళ్లే. పార్లమెంటు స్థానాల విజయాలు, అసెంబ్లీ ఎన్నికల విజయాలు ఇలాంటివి ఆయన క్రెడిట్లో ఉన్నప్పటికీ ఇలా జరగడం బాధాకరమని కొందరు అనుకుంటున్నారు.


గతంలో లక్ష్మణ్ అధ్యక్షుడుగా ఉన్నా కూడా విజయాలు వచ్చాయి. కానీ బండి సంజయ్ టైం లోనే ఎక్కువ విజయాలు నమోదయ్యాయి. కానీ ఆయన దురదృష్టం బిజెపి అధిష్టానం కూడా కాంగ్రెస్ లాగే తప్పు ఒప్పులు చూసుకోకుండా కేవలం కింద వారి కంప్లైంట్స్ ఆధారంగానే నిర్ణయం తీసుకోవడం  సంజయ్ కి మైనస్ అయిందని అంటున్నారు. భారతీయ జనతా పార్టీలో ఒకప్పుడు ఆళ్ల నరేంద్ర తర్వాత కార్యకర్తలకి బండి సంజయ్ మంచి మాస్ లీడర్ గా మారాడు.


రాజాసింగ్ ఒక నియోజక వర్గానికే పరిమితమైతే సంజయ్ మాత్రం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడిగా ఎదగడం విశేషం. అయితే బండి సంజయ్ భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీలో ఇంకా ఎంతో ఎత్తులు అధిగమిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ వ్యక్తిగత వైరాలతో బండి సంజయ్ పై కొంతమంది ఈ విధంగా ఫిర్యాదు చేయడంతో ఆయన రాజకీయ భవిష్యత్తును కోల్పోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: