చంద్రబాబు.. పవన్‌ను వాడేసుకుంటున్నారా?
బీజేపీకి రాష్ట్రంలో 0.8 శాతం ఉన్న ఓట్లు ఉన్న పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నారు. కానీ అంతకంటే ఎక్కువ ఓట్లు వచ్చిన కాంగ్రెస్, కమ్యూనిస్టులతో మాత్రం కలిసేందుకు టీడీపీ, జనసేన దూరంగా ఉంటున్నాయి. వారు వచ్చి పోటీ చేస్తామని ప్రకటిస్తున్నా కూడా వెళ్లడం లేదు. దీని వెనక బలమైన కారణాలు ఉన్నాయి. టీడీపీతో పొత్తు పెట్టుకున్న ప్రతిసారి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిందనే సెంటిమెంట్ ను బీజేపీ అధిష్టానానికి చెబుతున్నారు.
ఇలా చెప్పడం వల్ల బీజేపీ తమ ట్రాప్ లో పడిపోతుంది. అదే సమయంలో కేంద్రంలో బీజేపీతో కావాల్సిన పనులు చేయించుకోవచ్చు. ఆంధ్రలో ఎలాగో పెద్దగా పట్టు లేదు కాబట్టి సింగిల్ సీట్లకు పరిమితం చేసినా పెద్దగా పట్టించుకోరని అభిప్రాయపడుతున్నారు. మరి బీజేపీ, టీడీపీ కలుస్తాయా? పవన్ రెండు పార్టీలను కలిపేందుకు కృషి చేస్తున్నారు. పవన్, బాబు లు కూడా మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు. పవన్ ఎటాకింగ్ మోడ్ లో వెళుతుంటే.. బాబు సైలెంట్ గా తన పని కానిచ్చేస్తున్నారు. నియోజకవర్గాల్లో ఆయా నాయకులకు టికెట్లు కన్మర్ప్ చేస్తున్నారు.
ఇలా ఒక్కో నాయకుడి రూట్ సపరేట్ అని తెలుస్తోంది. సైకాలజికల్ మైండ్ గేమ్ నడిపిస్తున్నారు. పొత్తులకు సంబంధించి స్పష్టత రాకున్నా.. పవన్ మాత్రం ఎలాగైనా సీఎం జగన్ ను గద్దె దించాలని అంతిమ లక్ష్యంతో కొనసాగుతున్నారు. తనకు తన పార్టీకి సీట్లు ఓట్లు రాకున్నా జగన్ సీఎం పదవి పోతే చాలనే కాన్సెఫ్ట్ లో ఉన్నారు.