వివేకా హత్య.. ఆ పత్రిక రాతలు సబబేనా?

వై.ఎస్. వివేకా బతికి ఉంటే అవినాష్ రెడ్డికి టికెట్ రాదనే కోపంతోనే ఆయన్ను చంపించడానికి ఎల్లో మీడియా కథనాలు రాసుకొస్తుంది. అసలు వివేకాకు టికెట్ ఇచ్చేది ఎవరూ అవినాష్ రెడ్డి కాదు. జగన్ టికెట్ ఇవ్వాలి. కానీ టికెట్ విషయంలోనే మర్డర్ చేయించారని ఎల్లో మీడియాలో పుంఖానుపుంఖాలుగా వార్తలు రాస్తున్నారు. దీని వెనక సీఎం జగన్ ఉన్నారని కూడా పరోక్షంగా రాస్తున్నారు.


ఓ ఫైనాన్స్‌ను ఎత్తేసిన సమయంలో చిట్‌ఫండ్స్‌లో డిపాజిటర్ల రూపంలో డబ్బులు పెట్టుకుని ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తున్నారన్న ఆరోపణలు మాత్రం ఆ పత్రికలో రాయరు. ప్రజలకు ఒక విషయంలో నిజం నిర్భయంగా చెప్పాలనుకుని ఉండే ప్రధాన పత్రిక తన దానికి వస్తే మాత్రం
అన్నింటినీ దాచి పెడుతుంది. ఇలా చేయడం వల్ల ఎదుటి వ్యక్తి గురించి చెడుగా చెప్పి విజయం సాధించానని వీర్ర వీగుతుంది. కానీ అది ఏ మాత్రం నిజం కాదని తెలుసుకోవాలి.


ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్ ను నీతివంతుడు అని ప్రజలు అనుకోవడం లేదు. అదే సమయంలో చంద్రబాబును కూడా నీతివంతుడని ఎవరూ అనుకోవడం లేదు. రాజకీయ నాయకుల తీరును రెండు వైపులా గమనిస్తున్నారు. కానీ ప్రజలకు అవసరమైనది ఏదీ? ఏ సమయంలో వారి అవసరం పడుతుంది. ఎవరు పేద ప్రజలకు న్యాయం చేయగలుగుతారనే విషయాలను మాత్రం అర్థం చేసుకుని ఓట్లే వేస్తున్నారు.


కానీ వివేకా హత్య కేసు ద్వారా వైసీపీ పార్టీ మొత్తం నాశనం అయిపోయిందంటే నమ్మరు. ఆ ఫైనాన్స్‌, చిట్‌ఫండ్‌ సంస్థతోనే పెద్దాయన పూర్తిగా అవినీతి చేశారని, చంద్రబాబు పాత్ర లేనిదే అది జరగలేదని విమర్శలు చేసినంతా మాత్రాన దాన్ని నమ్మరు. కేవలం చంద్రబాబుకు ఆ పత్రికకు  మధ్య ఉన్న బంధాన్ని గుర్తు చేసుకుంటారు. అవసరమైతే గెలిపిస్తారు. లేకపోతే ఓడిస్తారు. కానీ జనాలు ఏదో నమ్మేస్తారని రాసే రోజులు మాత్రం పోయాయని గుర్తుంచుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: