ఇండియా సత్తా ఏంటో ఉక్రెయిన్ వార్‌ చెప్పేసింది మరి!

రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుండి మొన్నటి వరకు రష్యానే ఉక్రెయిన్ పై ఆధిపత్యం సాగించుకుంటూ వచ్చింది. ఉక్రెయిన్ కు అమెరికా, యూరప్ ఇంకా నాటో దేశాలు అందిస్తున్న ఆయుధాల జాడలను కనిపెట్టి మరీ దారిలోనే వాటిని ధ్వంసం చేసేది. అయితే ఈ మధ్యన ఉక్రెయిన్ దాడులను తిప్పి కొట్టడంలో అలాగే ఎదురు దాడులు చేయడంలో ఒకింత ముందే ఉంటూ వస్తుంది.


రష్యాకు సంబంధించిన అధునాతనమైన మిస్సైల్స్ ని కూడా తన ఎయిర్ డిఫెన్స్ సిస్టం ద్వారా ధ్వంసం చేసుకుంటూ వస్తుంది. అయితే ఉక్రెయిన్ ప్రస్తుతం ఒకే ఒక మిస్సైల్ ని మాత్రం నిలవరించ లేకపోయిందని తెలుస్తుంది. అదే మన బ్రహ్మోస్. మరి రష్యా యుద్ధం లో భారత్ కు సంబంధించిన మిస్సైల్ ప్రస్తావన ఏమిటి అంటే దానికి ఒక లెక్క ఉంది. ఈ బ్రహ్మోస్  మిస్సైల్ ను భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ, అలాగే రష్యా కు చెందిన ఎంపీఓఎం సంయుక్తంగా అభివృద్ధి చేసాయని సమాచారం.


బ్రహ్మోస్ ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న మిస్సైల్స్ అన్నిటి కన్నా అత్యంత వేగమైనది అని అంటున్నారు. ఈ బ్రహ్మోస్ మిస్సైల్స్ ను ఇటు భూమి మీద నుండి, నౌకల మీద నుండి, విమానం మీద నుండి, జలంతర్గామి నుండి కూడా ప్రయోగించవచ్చు. రష్యా క్రూయిజ్ క్షిపణి పీ-800 ఓనిక్స్ సాంకేతికతపై ఆధారపడి ఈ క్షిపణిని తయారు చేసారు. అయితే ఈ  శక్తిని ప్రత్యక్షంగా చూసిన ఉక్రెయిన్ మా ఎయిర్ డిఫెన్స్ సిస్టం అలాగే మా రాడర్స్ కి కూడా అందనంత వేగంతో వచ్చినందువల్లే 38మిసైల్స్ లో 19మిస్సైల్స్ ను దెబ్బ కొట్టలేకపోయాం అని బ్రహ్మోస్ మిస్సైల్స్ గురించి  స్వయంగా చెప్తుంది ఉక్రెయిన్.


భారత్ లో ప్రవహించే బ్రహ్మపుత్రా, రష్యాలోని మోస్క్వా నదుల పేర్లలోని మొదటి భాగాలను కలపగా ఏర్పడినదే బ్రహ్మోస్. ఈ బ్రహ్మోస్ మిస్సైల్ పేరు హిందూ పురాణాల్లోని బ్రహ్మాస్త్రం ను గుర్తు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: