జగన్‌ సాధించిన ఈ రికార్డు.. ఆ మీడియాకు కనపడదా?

భారత దేశంలో 2030 నాటికి తలసరి ఆదాయం 3.28 లక్షలకు చేరుతుందని స్టాండర్డ్ చార్టర్డ్ నివేదిక వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ అదే 2లక్షల 7వేల పైగా చేరుతుందని చెప్పింది. మరో ఏడేళ్లలో భారత దేశ తలసరి ఆదాయం సుమారు 70 శాతం పెరిగి నాలుగు వేల డాలర్లు సుమారు 3.28 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని తెలిపింది.

2023 సంవత్సరంలో ఇది 2423 డాలర్లు ఉండగా.. 2030కి ఆరు లక్షల కోట్ల డాలర్లకు ఎగబాకి   492 లక్షల కోట్ల జీడీపీతో మధ్య ఆదాయ ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్బవిస్తుందని పేర్కొంది. ఇందులో ఎక్కువగా గృహ వినియోగదారుల నుంచే వస్తుందని వివరించింది. తలసరి ఆదాయం 2001 నాటికి 460 డాలర్లు ఉంటే 2011 నాటికి 1413 కాగా 2021 నాటికి 2151  డాలర్లు పెరిగింది.

ఇది ప్రొగ్రెస్ రిపోర్టుగా భావించవచ్చు. మన్మోహన్ సింగ్ రాక ముందు 1400 డాలర్లు ఉంటే మోదీ వచ్చిన తర్వాత 2151 డాలర్లుగా మారింది. ఇది ఆర్థికంగా పెరిగిందనే చెప్పుకోవచ్చు.  భవిష్యత్తులో ఇండియాలో ఆర్థిక వృద్ధికి విదేశీ వాణిజ్యం బాగా తోడ్పడనుందని తెలుస్తోంది. విదేశీ వాణిజ్యం అనేది 2030 నాటికి  2.1 లక్షల కోట్ల డాలర్లకు చేరొచ్చని చెప్పింది.  2023 సంవత్సరంలో 1.3 లక్షల డాలర్లే అని తెలిపింది.

ప్రస్తుతం తెలంగాణ తలసరి ఆదాయం 3360 డాలర్లు అంటే రూ. 2. 75 లక్షలు అన్నమాట. కర్ణాటక తల సరి ఆదాయం 2. 65 లక్షలు ఉండగా.. తమిళనాడులో రూ. 2. 41 లక్షలు కేరళ 2.30 లక్షలు ఆంధ్రప్రదేశ్ రూ.2.7లక్షలు ఉంటుంది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్ర అయిదో స్థానానికి ఎగబాకింది. కానీ దీనిపై మంచి ప్రచారం చేయకుండా ఆంధ్రపై విషం చిమ్మ వార్తలు రాస్తున్నారు. అయిదో స్థానం అంటే మరి అంత దిగదుడుపైం కాదు. కానీ దీన్ని ఆంధ్రమీడియా తక్కువ చేసి చూపడం దురదృష్టకరం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: