ఆ ఒక్కపాట వల్ల.. ఉదయభానును తొక్కేశారా?
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నన్ను కావాలనే కొంతమంది తొక్కేశారని అని కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఎవరు ఆమెను తొక్కేశారు. ఎందుకు తొక్కేశారనే వివరాలు మాత్రం వెల్లడించలేదు. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హట్ టాఫిక్ గా మారాయి. ప్రస్తుతం యాంకర్ సుమ, రష్మీ, అనసూయ, శ్యామల, శ్రీముఖి, లాస్య లాంటి యాంకర్లు ఎంతో మంది యాంకర్లుగా స్థిరపడిపోయారు. అంతకుముందున్న జాన్సీ కూడా అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తుంది.
కానీ ఉదయభాను పెళ్లి చేసుకున్న తర్వాత మొత్తంగా బుల్లితెరకు, వెండితెరకు రెండింటికి దూరమైంది. అయితే ఆమె దూరం కావడానికి ఒక వివాదస్పదమైన పాట పాడటమే కారణమని బయట వినిపిస్తున్న టాక్. గంగా గరుడా ఎత్తుకెళ్లారు అనే పాట కేసీఆర్ పై పాడారని అందుకే ఆమెను తొక్కేశారని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. మరి ఆమె పాడిన పాటలో కేసీఆర్ గురించి ఎక్కడా లేదు.
కేవలం రాజకీయ నాయకుల గురించి మాత్రమే ఉంది. కచ్చితంగా ఒకరి పేరు మీద పెట్టి పాటలు పాడలేదు. మరి ఎందుకంత ఆమెపై కక్ష గట్టారు. ఆ వివరాలు ఆమె ఏమీ చెప్పకపోయినా సిని ఇండస్ట్రీకి మాత్రం దూరమై అయిదు సంవత్సరాలపైనే అవుతోంది. మరి ఉదయభాను ఆమెను ఎవరు తొక్కేశారో పేర్లు బయట పెడుతుందా? మళ్లీ యాంకరింగ్ వైపు వచ్చే ఆలోచనలు ఏమైనా చేస్తుందా చూడాలి.