వాస్తవం: దిల్‌ రాజు ఎంపీ కల తీరుతుందా?

తెలంగాణ నుంచి వచ్చి సినీ నిర్మాతగా దిల్ రాజు విజయవంతంగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. అయితే రాజకీయాలు వేరు సెలబ్రెటీ స్టేటస్ వేరు. డబ్బు ఉందని అహంకారంతో మాట్లాడితే మాత్రం ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. నేను ఎంపీగా పోటీ చేస్తానంటే అన్ని పార్టీలు టికెట్లు ఇస్తాయి. నేను గెలుస్తానని తేలికగా మాట్లాడారు. అయితే నిర్మాతల మండలికి ఎన్నికలు జరగబోయే సందర్భంలో వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తాను అనుకుంటే ఎంపీగా ఈజీగా గెలవగలుగుతానని అన్నారు.


సెలబ్రెటీ స్టేటస్ ఉన్న చిరంజీవి సీఎం కాలేకపోయారు. కృష్ణ, కృష్ణంరాజు, పవన్ కల్యాణ్, ఎన్టీఆర్ లాంటి గొప్ప గొప్ప నటులు కూడా ప్రజల చేతిలో ఓడిపోయారు. కేవలం సెలబ్రెటీ హోదా ఉండగానే గెలిచిపోరు. దానికి కావాల్సిన రాజకీయ లక్షణాలు ఉంటాయి. ప్రజలకు గెలిస్తే ఏం చేస్తాం అని చెప్పాలి. ఏసీల్లో కాలు మీద కాలేసుకుని కూర్చుని నేను గెలిచిస్తాను అంటే సరిపోదు.


రాజకీయాల్లో అనేక మైన ఒడుదొడుకులు ఉంటాయి. రాజకీయ పార్టీ దిల్ రాాజుకు టికెట్ డబ్బులు చూసి ఇచ్చినా ఆయన గెలవలాంటే పార్టీ తోడు కచ్చితంగా అవసరం పార్టీ సహకరించాలి. దీనికి తోడు ఆయన ఇమేజ్ పని చేయాలి. కానీ ఆ రెండు పని చేయని నాడు ఎన్ని డబ్బులున్నా ఈజీగా ఓడిపోవడం ఖాయం.


కాబట్టి రాజకీయాలనేవి డైనమిక్ సబ్జెక్టు. ప్రజలు ఎంతటి వారినైనా అధికారంలో నుంచి దించేయగల శక్తి ఉన్న వారు. ప్రజాస్వామ్యంలో అంతటి గొప్ప అవకాశం ప్రజలకు ఉంది.  ఏదో డబ్బులు ఉన్నాయి. నేననుకుంటే ఎంపీగా గెలిచేస్తాను. అంటే ప్రజలు ఊరికే ఓట్లు వేయరు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు కావాల్సిన నాయకులను మాత్రమే ఎన్నుకుంటారు. వారి సమస్యలు తీర్చే నాయకుల వైపే మొగ్గు చూపుతారు. సినిమాల్లో లాగా డబ్బులు ఉంటే పనులు జరిగిపోతాయని అనుకుంటే కుదరని పని అని దిల్ రాజు గుర్తుంచుకోవాలని పలువురు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: