జగనన్న నిర్ణయం.. వరం కాదు.. శాపం?

ఆంధ్రప్రదేశ్ లో లెక్చరర్ల వయసు 62 నుంచి 65కు పెంచారు. దీన్ని మీడియాలో అధ్యాపకులకు శుభవార్త పదవీ విరమణ వయసు పెంచారని పదే పదే వార్తలు ఇస్తున్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కూడా తమ ప్రభుత్వం అధ్యాపకులను తగిన న్యాయం చేసిందని చెప్పుకుంటున్నారు. గతంలో 58 ఉన్న పదవీ విరమణ వయసు 60, 62 గా మార్చి ఇప్పుడు 65 గా మార్చడంతో మొత్తం మీద ఇప్పుడు లెక్చరర్ల పదవీ విరమణ వయసు 65కు చేరింది.


ఎందుకు పదవీ విరమణ వయసు పెంచుతున్నారంటే దీని వెనక అసలు రహస్యం ఉంది. అయితే వారు రిటర్మైంట్ అయితే వారికి లక్షల్లో ప్రభుత్వం డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. దాదాపు 50 నుంచి 60 లక్షలు ఇవ్వాలి. దాదాపు ఇప్పుడు రిటైర్డ్ అయ్యే వారందరికి పాత పెన్షన్ విధానమే వర్తిస్తుంది. పెన్షన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే బోలెడంతా డబ్బులు ప్రభుత్వం రిటైర్డ్ అయ్యే ఉద్యోగులకు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి వయసు పెంచేస్తే ఇప్పుడు మూడేళ్ల దాకా ఆ బాధ తప్పుతుంది.


ఇక్కడొక విషయం తెలుసుకోవాలి. దాదాపు పదవీ విరమణ వయసు వచ్చిన తర్వాత ఆ ఉద్యోగి పని చేయాలని భావించడు. రిటైర్డ్ లైఫ్ ని సాఫీగా సాగిపోవాలని ప్లాన్ చేసుకుంటారు. సడెన్ గా మూడేళ్లు మళ్లీ ఉద్యోగం చేయమంటే ఓపిక లేదని చాలా మంది చెప్పే వారు ఉంటున్నారు. ఓపిక ఉన్నా లేకున్నా పాఠాలు చెప్పినా చెప్పకున్నా వారికి మూడేళ్ల పాటు జీతం రావాల్సిందే. రిటైర్డ్ అవ్వడానికి కుదరదు.


దీని వల్ల విద్యార్థులకు కూడా నష్టమే. అటు అధ్యాపకులు కూడా పాఠాలు చెప్పలేక, అలసిపోయి ఎప్పుడు రిటైర్డ్ అవుదామని చూస్తుంటే బలవంతంగా కూర్చొబెట్టి పాఠాలు చెప్పమంటే ఏ విధంగా సాధ్యపడుతుందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి మూడేళ్ల తర్వాత కూడా ఇంకా పెంచుతారా .. అప్పుడేంటీ పరిస్థితి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: