ఏపీ అప్పులపై ఎల్లో పత్రికల అసత్య ప్రచారం?
ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి పార్లమెంటులో మొన్న రఘురామ కృష్ణంరాజు వేసిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం చెప్పారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఎఫ్ ఆర్ బి ఎం నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రలో ఏమి జరగడం లేదని, అన్ని నిబంధనలకు లోబడే జరుగుతున్నాయని ఆవిడ చెప్పారు. సాక్షాత్తు కేంద్ర మంత్రి ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి స్పష్టంగా చెప్పినా కూడా ఎల్లో పత్రికలు రెండూ కూడా ఈ విషయాన్ని తెలియనివ్వలేదు అని అంటున్నారు.
అటు ఫ్రంట్ పేజీలో గాని, బ్యాక్ పేజీలో గాని ఈ విషయం గురించి ఆ రెండు పత్రికలు వ్రాయలేదని తెలుస్తుంది. ఓ ఎల్లో పత్రిక అయితే 9.30 లక్షల కోట్ల అప్పు అంటూ మళ్ళీ అదే విషయాన్ని వ్రాసుకుంటూ వచ్చింది . అంటే ఉన్న నిజాన్ని దాచేసి తమకు నచ్చిన, వచ్చిన ఇజాన్ని ప్రచారం చేస్తున్నాయి ఈ పత్రికలు. అంతే కాకుండా కార్పొరేషన్లకు డబ్బులు కూడా కట్టడం లేదని వ్రాసుకు వస్తుంది ఓ ఎల్లో పత్రిక .
దీనిని కవర్ చేయడం కోసం నిర్మలా సీతారామన్ ఆ విధంగా మాట్లాడారంటూ కూడా వీళ్లే వ్రాసుకోచ్చేస్తున్నారు. అంటే అవతల వ్యక్తి ఎంత కేంద్రమంత్రి అయినా, వారి మాట కూడా మా మాట ముందు చెల్లదన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు అంటున్నారు కొంత మంది. కాగ్ చెప్పినా, రిజర్వ్ బ్యాంక్ చెప్పినా, ఆఖరికి పార్లమెంట్ లో కేంద్ర మంత్రి చెప్పినా కూడా వాళ్లదే తప్పంటారు వీళ్ళు.