కాంగ్రెస్‌లో విలీనం.. షర్మిలకు కలిసొస్తుందా?

ఆంధ్రజ్యోతి కొంతమంది విషయంలో ముందుగా చెప్పేవి పక్కాగా నిజమవుతాయని అంటారు. అందులోనూ వైఎస్ షర్మిల గురించి ఇప్పటివరకు చెప్పిన మాటలన్నీ నిజమయ్యాయి అని కూడా తెలుస్తుంది. అయితే మరి ఆంధ్ర జ్యోతి కొత్తగా వైయస్ షర్మిల గురించి ఏం చెప్పిందంటే వైయస్ షర్మిల తన పెట్టిన పార్టీని  జాతీయ పార్టీలో విలీనం చేయబోతున్నట్లుగా చెప్పుకొచ్చింది.


గతంలో  వైయస్ షర్మిల తన అన్న నుండి విభేదించి ఆయనకు వ్యతిరేకంగా పార్టీని పెట్టబోతుందని ఆంధ్రజ్యోతి చెప్పింది. అయితే అప్పుడు అదే ఆంధ్రజ్యోతి వైయస్ షర్మిల తన పార్టీని ఆంధ్రప్రదేశ్ లో పెడుతుందని అనుకుంది. కానీ  షర్మిల వైయస్సార్ తెలంగాణ పార్టీ  అనే పేరుతో  తెలంగాణలో పెట్టుకొచ్చింది. అలాగే సునీత కూడా జగన్ ను విభేదిస్తుంది అనే విషయం కూడా ఆంధ్రజ్యోతి వ్రాసుకొచ్చింది‌.


మరి ఇప్పుడు తాజాగా ఆంధ్రజ్యోతి చెపుతున్న విషయం ఏమిటంటే వైయస్ షర్మిల తన వైయస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతుంది అన్నట్లుగా అది చెప్తుంది. అది కూడా ఎటువంటి షరతులు లేకుండా సోనియా గాంధీ సమక్షంలో త్వరలో తన పార్టీని విలీనం చేయబోతుందట  షర్మిల. తన అన్న ద్వారా తనకు థ్రెట్ ఉందని ఆమె ఈ విధంగా చేస్తుందని అంటున్నారు. గతంలో రామోజీరావు కొడుకు కూడా రామోజీరావు పైన అలిగి సాక్షిని సంప్రదించడం కూడా ఇదే కోవకు సంబంధించింది.


అయితే రాబోయే 15రోజుల్లో వై యస్ షర్మిల తన వైయస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతుందని అంటున్నారు. ఆ తర్వాత ఖమ్మం జిల్లా పాలేరు నుండి వైయస్ షర్మిల పోటీ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. అన్నకు వ్యతిరేకంగా ఆరాటంతో పార్టీ అయితే పెట్టింది. అలాగే అదే పార్టీని ప్రజల్లో ముందుకు తీసుకెళ్లడానికి కూడా పోరాడింది. కానీ ఈ లోగానే ఆరాటం పోరాటం అన్నీ పక్కనపెట్టి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతుంది షర్మిల.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: