రాహుల్ గాంధీ.. ఇది సరిపోదు.. ఇంకా పెంచాలి?
అవిశ్వాస తీర్మానం సమయంలో కూడా ప్లయింగ్ కిస్ వివాదంతో రాహుల్ చిక్కుల్లో పడ్డారు. అవిశ్వాస తీర్మానంతో ఏమీ సాధించారు. మణిపూర్ అంశంలో ప్రధాని మాట్లాడే సమయంలో పార్లమెంట్ నుంచి వెళ్లిపోయారు. చివరకు ప్రధాని నరేంద్ర మోదీ స్పీచ్ హైలైట్ గా మారింది. జవహర్ లాల్ నెహ్రు చేసిన మోసం వల్లే దేశం ఇప్పుడు ఇలా ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతుందని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ అని దుమ్మెత్తిపోశారు.
పార్లమెంట్ లో సభ్యుల స్పీచ్ కు అడ్డుపడుతున్నారని అధిర్ రంజన్ చౌదరిని సస్పెండ్ చేశారు. దీనిపై కూడా రాహుల్ గాంధీ లోక్ సభలో మాట్లాడకుండా ఉండిపోయారు. దీనిపై బయట మాట్లాడటం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి. ఇండియా కూటమి తర్వాత మిత్రపక్షాలను ఎక్కువగా రాహుల్ నమ్ముతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇలా నమ్మడం వల్ల కాంగ్రెస్ లాభం మాట దేవుడెరుగు.. నష్టమే ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
మిత్రపక్ష పార్టీలు ఆయా రాష్ట్రాల్లో బలంగా తయారవుతున్నాయి. మరి ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీని బలంగా తయారు చేయకపోతే కూడా రాహుల్ కలలు కంటున్న ప్రధాని పదవి తన దరికి చేరకపోవచ్చు. మొత్తం మీద అవిశ్వాస తీర్మానం సమయంలో రాహుల్ తన పూర్తి సత్తా ను నిరూపించలేకపోయారని మంచి అవకాశాన్ని చేజేతులా పొగొట్టారని విమర్శలు చేస్తున్నారు.