కేసీఆర్ గారూ.. ఇది కరెక్టు కాదు..?
నిజాయతీ లేదని.. జెన్యూనిటీ లేదు కానీ ఉండాలని చెబుతారని.. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ కనీసం కరెంట్ బిల్లు ఎందుకు చెల్లించలేక పోతుందో చెప్పాలని సీఎం కేసీఆర్ ను ఆంధ్ర మేధావులు ప్రశ్నిస్తున్నారు. మనం వేరే వాళ్ల ఆస్తులు దోచుకోవచ్చా అని అడుగుతున్నారు. తెలంగాణ పౌరులు నిజాయతీ పరులుగా ఉంటారన్న పేరుందని గుర్తు చేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రకు ఇవ్వాల్సిన సెక్షన్ 9, సెక్షన్ 10 కింద మొత్తాన్ని ఇవ్వకుండా విభజన హామీలను అటకెక్కిస్తున్నారంటున్నారు. పెద్ద మనుషుల లాగా కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాల్సిన వారు ఇంకా సాగదీస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదేళ్లు దాటి పదో ఏటా పూర్తి కావొస్తుంది. కానీ ఇప్పటి వరకు విభజన సమస్యలు పరిష్కారం కాలేవంటే ఏమని అర్థం చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులో చొరవ తీసుకోవాలి. తెలంగాణకు బంగారు నిధిగా ఉన్న హైదరాబాద్ లాంటి నగరాన్ని ఇచ్చినపుడు ఆంధ్రకు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదన్న వాదన ఉంది.
పోనీ పోలవరానికి నిధులు సరిగా కేటాయిస్తున్నారా.. హోదా విషయంలో జాప్యం ఎందుకు చేస్తున్నారు. కనీసం తెలంగాణ రాష్ట్రం నుంచి రావాల్సిన బకాయిలను ఇచ్చేందుకు అయినా ప్రయత్నాలు చేస్తున్నారా? ఈ ప్రశ్నలకు అన్నింటికి కేంద్రం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వద్ద సమాధానాలు లేవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినపుడు తీవ్ర అప్పుల్లో కూరుకుపోయింది. ఇలాంటి సందర్భంలో కాపాడాల్సిన కేంద్రం, అప్పులు తీర్చాల్సిన తెలంగాణ పట్టించుకోకపోవడం దారుణమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.