చంద్రయాన్ ఓకే.. ఇక సూర్యుడే ఇస్రో టార్గెట్?
అయితే ఇస్రోలో సెప్టెంబర్ మెదటివారంలో ఆదిత్య ఎల్ 1 అనే పేరుతో అంతరిక్ష నౌకను ప్రయోగించనుంది. ఇస్రో తన అధికార సోషల్ మీడియాలో వెల్లడించింది. బెంగళూరులోని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ నుంచి శ్రీహరి కోటలోకి షార్ కు చేరుకుంది. షార్ లోని రెండో ప్రయోగ వేదిక నుంచి పీఎస్ ఎల్వీ ఆదిత్య ఎల్ 1 రాకెట్ ను ప్రయోగిస్తారు. సీ 57 రాకెట్ ద్వారా ఆదిత్య ఎల్ 1 స్పేస్ క్రాప్టు ప్రయోగిస్తారు. ఇక్కడ వెహికల్ అనుసంధానం బిల్డింగ్ లో మూడు రకాల అనుసంధానం బిల్డింగ్ పూర్తి చేస్తారు. ఆదిత్య ఎల్ 1కి గ్రీన్ రూంలో పరీక్షల అనంతరం రాకెట్ కు శిఖర భాగంలో అమర్చుతారు.
ఈ ప్రయోగం ద్వారా సూర్యుడు, భూమి కి మధ్య ఉన్న లాంగ్ రేంజ్ వ్యవస్థలో ఎల్ 1 చుట్టూ ఉన్న కక్షలోకి ప్రవేశపెడతారు. ఇది భూమికి 10.5 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుంచి సూర్యుడిపై అధ్యయనం చేయడానికి అడ్డంకులు ఉండవని సైంటిస్టులు చెబుతున్నారు. కానీ ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకోకుండా కొంతమంది స్వయం ప్రకటిత మేధావులు చంద్రుడి మీద ప్రయోగం అయిపోయింది. ఇక సూర్యుడి మీదకే ప్రయాణం అని వితండ వాదానికి దిగుతున్నారు. అసలు నిజాన్ని తెలుసుకోవాలని సైంటిస్టులు చెబుతున్నారు.