కొత్త సర్వే: తెలంగాణలో బీజేపీ జోరు తగ్గిపోయిందా?

తెలంగాణలో గతంలో పొలిటిక్స్ కు సంబంధించి రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటోందని దాదాపు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు 5 నుంచి 6 ఎంపీ స్థానాలు గెలుచుకుంటారని టైమ్స్ నౌ అంచనా వేసింది. కానీ ప్రస్తుతం మళ్లీ చేసిన సర్వేలో బీజేపీ కేవలం 2 నుంచి 3 స్థానాలు గెలుచుకుంటుందని బీఆర్ఎస్ 11 స్థానాలు గెలుచుకుంటుందని కాంగ్రెస్ 3 నుంచి 4 స్థానాలు, ఇతరులు ఒక స్థానానికి పరిమితం అవుతారని టైమ్స్ నౌ చేసిన తాజా సర్వే లో తేలింది.


దాదాపు బీఆర్ఎస్ కు 38 శాతం ఓట్లు, కాంగ్రెస్ కు 29. 4 శాతం ఓట్లు, బీజేపీకి 24 శాతం ఓట్లు వస్తాయని పేర్కొంది. దీంతో మొన్నటి వరకు రెండో స్థానంలో ఉన్న బీజేపీ ఎలాగైనా అధికారంలోకి రావాలని తహతహలాడింది. ఈ సారి తెలంగాణలో ఎలాగైన పార్టీని గెలిపించుకోవాలని గట్టి పట్టుదలతో బండి సంజయ్ ఆధ్వర్యంలో గట్టిగా పోరాడింది. దుబ్బాక, హుజురాబాద్, జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో గెలిచి మంచి ఊపు తీసుకొచ్చింది. బీజేపీ లో బూత్ స్థాయి కార్యకర్తలు కూడా తీవ్రంగా పోరాడారు.


కానీ ఒక్కసారిగా కిషన్ రెడ్డికి తెలంగాణలో రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వడం బండి సంజయ్ ను తొలగించడంతో పార్టీ శ్రేణులు బహిరంగంగానే బీజేపీ అధిష్టానంపై విరుచుకుపడ్డాయి. మంచి ఊపు మీదున్న సమయంలో ముఖ్యంగా రాబోయే రెండు నెలల్లో ఎన్నికలు ఉన్నాయనగా ఎందుకు రాష్ట్ర అధ్యక్షుడిని మార్చారో తెలియదు కానీ ఒక్కసారిగా బీజేపీ ఊపు తగ్గిపోయింది.


కిషన్ రెడ్డి సౌమ్యుడని అందుకే బీఆర్ఎస్ తో లోపాయికారి ఒప్పందం కారణంగానే ఇలా బండి సంజయ్ ను ఉన్నపళంగా మార్చారని అన్నారు. అయితే బీజేపీ గతంలో 5 లేదా 6 ఎంపీ స్థానాల్లో గెలుస్తుందని అనుకుంటే ఒక్కసారిగా పార్టీ అధ్యక్షుడి మార్పుతో రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. దీంతో రాష్ట్రంలో బీజేపీ గెలవడం అంతా ఈజీ కాదని తేలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

BJP

సంబంధిత వార్తలు: