రష్యా నిర్ణయం.. ప్రపంచానికి అత్యంత ప్రమాదకరం?
ఎక్కడ విఫలమయ్యాం. ఎందులో రష్యా వెనకబడింది. ఇఫ్పుడు దేశంలో ఎలాంటి ఆయుధాలను తయారు చేసుకోవాలి. అమెరికాను సైతం ఓడించేందుకు గత ఆయుధ సంపత్తిని పెంపొందించుకోవడం ఎలా? ఏ ఆయుధాల తయారీతో ప్రపంచంలో అగ్రగామిగా నిలవచ్చొనే ప్రయత్నాలు పుతిన్ చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ తో యుద్దం కేవలం ట్రయల్ మాత్రమేనని అసలు కథ ముందుండ వచ్చని రష్యా భావిస్తోంది.
తాజాగా ఎంటు లేజర్ గైడెడ్ అనే యుద్ధ ట్యాంకులు చేసి బీభత్సం మామూలు కాదు. అయినా ఈ యుద్ద ట్యాంకులను దాదాపు 25 శాతం మునపటి కంటే వేగంగా శక్తి మంతంగా తయారు చేసేందుకు సిద్ధమైంది. రష్యా కు ఎంటు లేజర్ గైడెడ్ యుద్ధ ట్యాంకులు ఉక్రెయిన్ యుద్ధంలో చాలా బాగా ఉపయోగపడ్డాయి. ఎంతలా అంటే యూరప్ దేశాలు, అమెరికా సైతం ఇచ్చిన అధునాతన యుద్ధ ట్యాంకుల్ని కూడా ఇవి ధ్వంసం చేశాయి. దీంతో ఉక్రెయిన్ దిక్కుతోచని పరిస్థితిలో పడింది.
అయినా అణ్వస్త్ర దేశమైన రష్యాతో ఉక్రెయిన్ యుద్దానికి దిగడానికి ప్రధాన కారణం ఆ దేశం నాటోలో చేరతానని ప్రకటించడం. పోనీ యుద్ధం ప్రారంభమై 500 రోజులు కావొస్తుంది ఏమైనా నాటోలో యూరప్ దేశాలు చేర్చుకున్నాయా అంటే అది లేదు. యుద్దం ప్రారంభమైన తర్వాత మరో రెండు దేశాలను కూడా నాటోలో చేర్చుకున్నారు. కానీ ఉక్రెయిన్ కు మాత్రం అవకాశం ఇవ్వడం లేదు. ఇలాంటి సమయంలో అమెరికాను ఇంకా నమ్మి యుద్ధం చేస్తే చివరకు ఉక్రెయిన్ మిగిలేది శూన్యమేనని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.