దిల్లీలో ఆప్‌, కాంగ్రెస్‌ మధ్య సయోధ్య కుదిరేనా?

రాజకీయాల్లో బలం ఉన్న లేకపోయినా చివరి వరకు ఓంటరిగా పోరాడటమే మేలు. ముఖ్యంగా పొత్తులు పెట్టుకుని మిత్రపక్షాలుగా ఉంటామనుకున్న వారే చివరకు శత్రువులుగా మారి వ్యతిరేకంగా పోటీ చేయాల్సి వస్తుంటుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఇప్పుడు అదే సమస్యగా మారింది. 2014, 2019 లో కాంగ్రెస్ కేంద్రంలో అధికారం కోల్పోయింది. దీంతో ఈ దఫా కూడా కాంగ్రెస్ ఓడిపోతే పరిస్థితి ఏంటి అనే భయం పట్టుకుని రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా భారత్ జోడో యాత్ర చేపట్టారు.


అయితే అప్పుడు సుదీర్ఘ కాలంగా ఓడిపోతున్నాం. ఉత్తరప్రదేశ్, బిహార్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, తమిళనాడు లాంటి ప్రాంతాల్లో ఎందుకు ఓడిపోతున్నాం.. దానికి గల కారణాలను విశ్లేషించుకుని అందరితో మాట్లాడి పార్టీని సంస్థాగతంగా బలంగా తయారు చేసే ప్రయత్నాలు చేయాలి. కానీ ఇవేవీ చేయకుండా కేవలం పాదయాత్రతో దాన్ని ముగించారు. ఒకప్పుడు బద్ద శత్రువులైన కమ్యూనిస్టులు, ఆమ్ ఆద్మీ, సమాజ్ వాదీ, ఎన్సీపీలతో కాంగ్రెస్ దోస్తీ చేస్తోంది.


అయితే వీరు ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు చాలా బలంగా ఉన్నారు. కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమించి ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి అలకానంద ఒక స్టేట్ మెంట్ ఇచ్చారు. ఢిల్లీలో ఏడు స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని ప్రకటించారు. అయితే పంజాబ్, ఢిల్లీలో కలిసి 20 కి పైగా స్థానాలు ఉంటే అందులో కేవలం 7 ఎంపీ స్థానాలు మాత్రమే కాంగ్రెస్ కు ఇస్తామని ప్రకటించారు.


అలాగే పంజాబ్ లో అయిదు సీట్లు, ఢిల్లీలో 2 సీట్లు మాత్రమే ఇస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ చెబుతోంది. పోనీ విడిపోయి పోటీ చేస్తే గెలుస్తామన్న నమ్మకం కాంగ్రెస్ కు కలగడం లేదు. పొత్తులో భాగంగా పోటీ చేస్తే తక్కువ సీట్లు వస్తాయి. అప్పుడు ఓడిపోయిన గెలిచిన ఆప్ నుంచి సహకారం ఉంటుంది. కేంద్రంలో ఎలాగైనా అధికారం చేపట్టవచ్చనే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

AAP

సంబంధిత వార్తలు: