భారత్‌కు బిగ్ ఛాలెంజ్‌గా మారిన ఆ సమావేశాలు?
అలా వెళ్ళిన సైన్యానికి ఒక చోట నివ్వెరపోయేంత ఆయుధ డంప్ లభ్యమయిందని తెలుస్తుంది. ఈ ఆయుధ డంప్ తో దేశంపై ఒక చిన్న యుద్ధమే చేయొచ్చని అంటున్నారు. గతంలో ముంబైలో జరిగినటువంటి దాడి ఇలాంటి ఒక ఆయుధ డంప్ వల్లనే సాధ్యమైందని తెలుస్తుంది. అందువల్లే అప్పుడు ఒక పదిమంది చేతులు నిండా ఆయుధాలతో వచ్చి దాడి చేయడం జరిగింది. ఇప్పుడు భారత సైన్యానికి సంబంధించిన మూడు విభాగాలు ఆర్మీ, బిఎస్ఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు ముగ్గురూ కలిసి చేసిన తనిఖీలో ఈ ఆయుధాల డంపు లభ్యమయిందని అంటున్నారు.
అక్కడ ఏకే47, అలాగే హ్యాండ్ గ్రైనేడ్లు లాంటి అనేక ఆయుధాలు దొరికాయి అని అంటున్నారు. అంతే కాకుండా భారత సైనికుల చేతిలో గాయపడిన తీవ్రవాది కూడా ఈ ఆయుధాల డంపు వద్ద గాయాలతో చచ్చి పడున్నాడని కనుగొనడం జరిగింది. అయితే ఇంకా ఎంత మంది వచ్చారు, ఎంత మంది తప్పించుకున్నారు అనే విషయం దర్యాప్తు చేస్తున్నారు.
ముఖ్యంగా వీళ్లు మొన్న జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలను భగ్నం చేయడానికి వచ్చారని అందుతున్న సమాచారం. అయితే మొన్న భారత ప్రభుత్వం ఈ కుట్రను విజయవంతంగా భగ్నం చేయడం అయితే జరిగింది. కానీ భారత రక్షణ వ్యవస్థకు ఇప్పుడే నిజమైన ఛాలెంజ్ ఉంది. ఎందుకంటే త్వరలో భారత్ లో జీ20 సమావేశాలు జరగబోతున్నాయి. దాని కోసం భారత్ దేశమంతటా మరింత పకడ్బందీగా తనిఖీలు చేయడం అయితే జరుగుతుంది.