మార్గదర్శిపై ఫిర్యాదులు: జగన్ వ్యూహం ఫలిస్తోందా?
దీనిపై విచారణ జరగనుంది. ఇదంతా ఉత్తిదేననే తరహాలో ఈనాడు కార్టూన్ వేసింది. సాక్షిలో మాత్రం 300 కి పైగా ఫిర్యాదులు వచ్చాయని మార్గదర్శి చిట్ ఫండ్ లో చిట్టి లు వేసి మోసపోయిన వారు సీఐడీకి ఫిర్యాదు చేశారని రాసుకొచ్చింది. చందాదారులు ఫిర్యాదు చేసేందుకు 94931 74065 వాట్సాప్ నెంబరును సంప్రదిస్తున్నారని తెలిపింది. అంతకు ముందు కేవలం సీఐడీకి 100 ఫిర్యాదులు వస్తే ప్రస్తుతం 300 ఫిర్యాదుల వచ్చాయని పేర్కొంది.
ఇవి మరిన్ని పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. విజయనగరంలో 6 లక్షల విలువైన నాలుగు చిట్టి గ్రూపుల్లో సభ్యుడిగా ఉన్నారు. ఆయన చిట్టి పాట పాడి రెండు ఎల్ఐసీ బాండ్లను షూరిటీగా సమర్పించారు. అయిదు లక్షలు, రెండు విలువైన రెండు బాండ్లను షూరిటీగా ఇచ్చారు. ఆ చిట్టి గ్రూపు కాలపరిమితి నెలలు గడుస్తున్నా.. ఎల్ ఐసీ బాండ్లను తిరిగి ఇవ్వడం లేదని చెబుతున్నారు బాధితుడు మార్గదర్శి బ్రాంచ్ మేనేజర్ ను ఎన్ని సార్లు కలిసినా అరణ్య రోదనగానే మారిందంటున్నారు.
అలాగే విశాఖపట్నంలోని ఓ చందాదారుడు రూ. 40 లక్షల చిట్టి లో చేరారట. 20 నెలలు వాయిదాలు చెల్లించినా తర్వాత 8 లక్షల నష్టానికి పాట పాడి 32 లక్షలు దక్కించుకున్నా.. ఏడాదిన్నర అయినా ఆయనకు డబ్బులు చెల్లించలేదట. ఇలా అనేక కేస్ స్టడీలను సాక్షి తన పత్రికలో రాస్తోంది. మరి వాస్తవం ఏంటో విచారణలో కానీ తెలియదు.