ఇండియా, ఎన్డీఏ.. ఎవరికీ పట్టని చంద్రబాబు?
అంటే ఈ పని వెనకాల ఒక లాజిక్ ని నారాయణ వాడుతున్నట్లుగా తెలుస్తుంది. అదేంటంటే ఐ ఎన్ డి ఐ ఏ కూటమిలో ఉన్న తాను చంద్రబాబు నాయుడు ని పిలవడం అంటే ఐ ఎన్ డి ఐ ఏ కూటమి ఆహ్వానించినట్లే కదా అని ఆయన ఉద్దేశం. అయితే నిజానికి చంద్రబాబు నాయుడు మొన్నటి వరకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని పొత్తు కోసం పిలిచారు. ఎందుకంటే మెజారిటీ వర్గం అయినటువంటి కాపుల ఓట్లు తెలుగుదేశం పార్టీ వైపు మళ్లించాలని ఆయన చేసిన ఆలోచన ఇది.
అయితే ఇప్పుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అయితే తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో కలిసి సాగుదామని అనుకుంటుంది. అయితే భారతీయ జనతా పార్టీ మొన్నటి వరకు దీనిపై సరైన స్పందన ఇవ్వలేదు. కానీ మొన్న ఇండియా టుడే సర్వే తెలుగుదేశానికి అనుకూలంగా రావడంతో ఇప్పుడు ఎన్ డి ఏ, అంటే భారతీయ జనతా పార్టీ తెలుగు దేశం వైపుకు చూస్తున్నట్లుగా తెలుస్తుంది.
ఈ రకంగా ఎన్డీఏ కూటమి, అలాగే ఐ ఎన్ డి ఐ ఏ కూటమి రెండూ కూడా చంద్రబాబు నాయుడుని ఆహ్వానిస్తున్నట్లుగా నారాయణ చేసుకొస్తున్నారట. దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు ని మంచి విజన్ ఉన్న నాయకుడిగా హైలైట్ చేసుకు రావాలని సిపిఐ లీడర్ నారాయణ అనుకుంటున్నారట.