మోదీకి ఒక్కొక్కరుగా హ్యండిస్తున్నారా?
రష్యా భారత్ రెండు మంచి మిత్ర దేశాలు. పుతిన్ తన విదేశాంగ మంత్రి సెర్గోవ్ ను పంపిస్తున్నట్లు చెప్పారు. మరో వైపు మొన్నటి వరకు చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ వస్తాడని అందరూ అనుకున్నారు. అయితే జిన్ పింగ్ రావడం లేదని ప్రకటించారు. చైనా అధికార యంత్రాంగం మాత్రం ఈ సదస్సుకు హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశాలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వస్తున్నారు.
ఒక రోజు ముందుగానే ఇండియా చేరుకుని నరేంద్ర మోదీతో సమావేశమవుతారు. చైనా అధ్యక్షుడిని భారత్ లో కలవాలని అనుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. కానీ షీ జిన్ పింగ్ మాత్రం రావడం లేదని చెప్పడంతో ఇది కుదరలేదు. నరేంద్ర మోదీకి బాగా క్లోజ్ అయిన సౌదీ యువరాజు మహ్మాద్ బిన్ సల్మాన్ కూడా ఇండియాకు రావడం లేదని తెలుస్తోంది. సౌదీ యువరాజు ప్రధానికి చాలా మంచి మిత్రుడు. అయితే ఇది పాకిస్థాన్ మీడియా చెబుతున్న అంశం. సౌదీ యువరాజు జీ 20 సమావేశాలకు వెళ్లడం లేదు. పాకిస్థాన్ వైపే ఉన్నాడని పాక్ పత్రికలు రాస్తున్నాయి.
అయితే సమావేశాలు అతి త్వరలో ఉన్నందున ఇంకా ఎవరెవరూ వచ్చే అవకాశం ఉంది. ఆయా దేశాల అతిథులు బస చేసేందుకు వారికి కావాల్సిన హోటల్స్ ను రెడీ చేస్తున్నారు. వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు ఏమేం ఆహారం తీసుకుంటారో ఆయా డిష్ లకు సంబంధించి వంటకాలు చేసేందుకు చెఫ్ లను కూడా సిద్ధం చేశారు.