బీజేపీ ఆస్తులు చూస్తే గుడ్లు తేలేయాల్సిందే?
అందులో భారతీయ జనతా పార్టీకి మొత్తం 6046 కోట్లు, కాంగ్రెస్ 805 కోట్లు, బీఎస్సీ 605 కోట్లు, తృణమూల్ కాంగ్రెస్ ఆస్తి 400 కోట్లకు పైనే ఉంటుంది. అయితే చాలా పార్టీలు సరైన లెక్కలు చెప్పకుండా ఉన్నవి ఎన్నో ఉన్నాయని తెలుస్తోంది. బీజేపీ మాత్రం దేశంలో అతిపెద్ద నిధులు ఉన్న పార్టీగా చెప్పొచ్చు. కాంగ్రెస్ గతంల50 ఏళ్లు పాలించింది. కానీ దాని ఆస్తులు మాత్రం ఎక్కువగా లేకపోవడం ఇక్కడ వింతగా అనుకోవచ్చు. అయితే కమ్యూనిస్టుల పార్టీల ఆస్తుల వివరాలు మాత్రం చెప్పరు.
కానీ ప్రతి చిన్న పెద్ద నగరంలో కమ్యూనిస్టులకు సొంతంగా పార్టీల ఆఫీసులు ఉంటాయి. అదే బీజేపీ, కాంగ్రెస్ లాంటి వాటికి కూడా కొన్ని ప్రాంతాల్లో అద్దె భవనాల్లోనే కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. అయితే విజయవాడ లాంటి సిటీలో బీజేపీకి కేవలం ఒకే ఒక్క కార్యాలయం ఉంది. కానీ కమ్యూనిస్టులకు కూడా కార్యాలయం ఉంటుంది. అదే విధంగా వివిధ ప్రాంతాల్లో కూడా అనేక సొంత భవనాలు ఉన్నాయి. కానీ వీటిని వీరు ఎక్కడా కూడా బయటపెట్టడానికి ఇష్టపడరు. ఎందుకంటే వారి సిద్ధాంతాలు ఒప్పుకోరని చెబుతుంటారు.
కానీ రాజకీయ పార్టీల ఆస్తుల వివరాల్లో ఎంత వరకు పారదర్శకత ఉన్నది మాత్రం దేవుడికే ఎరుక. చాలా మంది చాలా రకాలుగా పార్టీలకు ఫండ్స్ ఇస్తుంటారు పార్టీలు ముందుగా ఆర్థికంగా బలంగా ఉంటేనే ఆయా వ్యాపార వేత్తలు, వర్తకులు కూడా హ్యపీగా ఉంటారు. కారణం ఏ పార్టీ వద్దకు వెళ్లినా పనులు ఇట్టే అయిపోతాయి.