తిరుమల నడకదారిలో చిరుతలు.. ఎందుకు ఇలా?
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఒక చిన్నారి ప్రాణం కోల్పోయిందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా అప్పుడు ఆరోపించడం జరిగింది . తిరుమల ఘాట్ రోడ్డులో ఈ విధంగా వన్యప్రాణుల సంచారం కలకలం రేపుతుంది. దాంతో ఆ మార్గం అంత రీ కన్స్ట్రక్షన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఉదయం 5గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే చిన్నపిల్లల తల్లిదండ్రులకు అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలలో పర్మిషన్ ఉంటుందని చెప్పుకొచ్చింది టీటీడీ.
మధ్యాహ్నం రెండు గంటలు దాటిన తర్వాత చిన్న పిల్లలకు అనుమతి లేదని చెప్పింది టీటీడీ. రాత్రి పది గంటల వరకు మాత్రమే పెద్దలకు ఆ మార్గంలో ప్రవేశం ఉంటుందని కూడా స్పష్టం చేసింది. అంతేకాకుండా ప్రయోగాత్మకంగా నడక మార్గంలో వెళ్లే వాళ్ళకి కర్రలను కూడా అందించింది టీటీడీ. అయితే ఈ నడక మార్గంలో కర్రల పంపిణీ విషయంలో విపరీతంగా సోషల్ మీడియాలోనూ, బయటా కూడా ట్రోలింగ్ జరుగుతుంది.
కర్ర చూస్తే పులి పారిపోదు కదా అని విమర్శిస్తున్నారు కొంతమంది. అయితే ఇలా విమర్శించే వాళ్ళు మరి ఏం చేయాలో కూడా సలహా ఇవ్వాలి కదా అని అంటున్నారు మరి కొంతమంది. అయితే ఎక్కడో అడవుల్లో ఉండవలసిన పులులు జనావాసాల్లోకి ఎందుకు వస్తున్నాయి అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. అడవుల్లో ఉండే పులులకు సరైన ఆహారం దొరకకే ఈ విధంగా జనాల్లోకి వస్తున్నాయా అనేది తేలాల్సి ఉంది.