ఔనా.. పక్కా ప్లాన్‌తోనే చంద్రబాబు జైలుకు వెళ్లారా?
ఎందుకంటే ఆయన వ్యవహార శైలికి, చంద్రబాబు నాయుడు వ్యవహార శైలికి మధ్య తేడా ఉంటుందని వాళ్లు అంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లక్ష్మీపార్వతిని వివాహం చేసుకోవడంతో చంద్రబాబు నాయుడు రామోజీరావు వీళ్ళందరూ కూడా పార్టీకి ఏమవుతుందో అని భయపడ్డారని అంటారు. ప్రతిపక్షంలో ఉండగా ఇటువంటి వివాహం చేసుకోవడం అనేది కరెక్టా అని అప్పుడు పార్టీలో ఉన్న సీనియర్ నేతలతో పాటు చంద్రబాబు, రామోజీరావు వీళ్ళందరూ భావించారని చెబుతారు.
అప్పటికి ఆయనకి నచ్చచెప్పి చూసారు. అయినా కూడా వినకపోవడంతో 94లో సీనియర్ నేతలు అందరూ కూడా చంద్రబాబు నాయుడుకి మద్దతు తెలిపి ఆయనను తెలుగుదేశం పార్టీ నేతగా నిలబెట్టారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అపర చాణుక్యుడు చంద్రబాబు నాయుడు అని అంటారు రాజకీయ విశ్లేషకులు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆయనను అరెస్టు చేస్తారని ఆయనకు ముందే తెలిసిన కూడా ఆయన ఏమీ తెలియనట్టు ఉండిపోయారు.
మీడియాలో హైప్ రావాలని, జనాల్లో చర్చ జరగాలని ఆయన ఆ విధంగా సైలెంట్ గా ఉండిపోయారన్న వాదన వినిపిస్తోంది. లేదంటే టిడిపి శ్రేణులు, అభిమానులు రాత్రికి రాత్రే హడావుడి సృష్టిస్తారని, అలా జరగకూడదని ఆయన భావించారు. అంతే కాకుండా ఆయన రావడానికి హెలికాప్టర్ ని పంపిస్తామంటే ఆయన కాదని బస్సులోనే అంత దూరం వచ్చారు. ఇదంతా కూడా టిడిపిపై సానుభూతి కోసం అదే సమయంలో వైసీపీపై ద్వేషం కలగాలని ఆయన అలా చేశారని కొందరు భావిస్తున్నారు.