ABN ఆర్కే: బాబు డబ్బు తీసుకోవడం తప్పేమీ కాదట?

చంద్రబాబు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరస్టయిన తర్వాత ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వాయిస్ కూడా మారిపోయింది. గతంలో జగన్‌ అవినీతిని చీల్చి చెండాడుతూ రాతలు రాసిన రాధాకృష్ణ.. ఇప్పుడు మాత్రం కొత్త రాగం వినిపిస్తున్నారు. రాజకీయ పార్టీలు డబ్బు తీసుకోకుండా ఎలా నడుస్తాయ్ అంటూ గదమాయించి ప్రశ్నిస్తున్నారు కూడా. అలాగే దేశంలోని అనేక మంది నాయకుల వలె చంద్రబాబు కూడా పార్టీ అవసరాల కోసం డబ్బు తీసుకొని ఉంటారని తేల్చి చెప్పేశారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ.


చంద్రబాబు ఎవరి దగ్గరా డబ్బు తీసుకోలేదని చెప్పడం అతిశయోక్తి అవుతుందన్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ..  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆ మధ్య విలేఖరులతో మాట్లాడుతూ పార్టీ అవసరాల కోసం మేం బరాబర్‌ డబ్బు తీసుకుంటామని చెప్పారని గుర్తు చేస్తున్నారు. ఎవరు మాత్రం డబ్బు తీసుకోవడం లేదని కేసీఆర్ సవాలు కూడా చేశారట. అందుకే అచ్చు అలాగే.. మా  చంద్రబాబు కూడా అలాగే పార్టీ అవసరాల కోసం తీసుకోకుండా ఎలా సాధ్యం చెప్పండి అంటూ నిలదీస్తున్నాడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ.


అంతే కాదు.. చందాల రూపంలో వచ్చే డబ్బుతో సొంత ఆస్తులు కూడబెట్టుకొని ఉంటే అది తప్పే అవుతుందట. అక్రమ సంపాదనతో చంద్రబాబు సింగపూర్‌లో హోటల్‌ నిర్మించారని రాజశేఖర రెడ్డి హయాం నుంచీ ఆరోపిస్తున్నారని.. కానీ ఇంతవరకూ ఆ విషయాన్ని ఎవరూ రుజువు చేయలేకపోయారని బాబును వెనకేసుకొచ్చాడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. ఇంత వరకూ బాగానే మరి జగన్ అవినీతి మాత్రం ఎవరు నిరూపించారు కనుక అని ప్రశ్నిస్తే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏం సమాధానం చెబుతారో మరి.


అమరావతిలో చంద్రబాబు బినామీ పేర్లతో వందల ఎకరాలు సమకూర్చుకున్నారని వైసీపీ నాయుకు ఆరోపించినా నాలుగేళ్లుగా ఇది కూడా రుజువు చేయలేకపోయారని కూడా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అంటున్నారు. అలాగే వ్యాపార, పారిశ్రామికవేత్తలు ఎవరైనా రాజకీయ పార్టీలకు నిధులు ఎందుకిస్తారండీ అని ప్రశ్నిస్తున్నారు. అబ్బే అవినీతి చేయని నాయకుడు ఎవరండీ అని అమాయకంగా ప్రశ్నిస్తున్న  ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ.. మరి ఇన్నాళ్లూ జగన్‌పై ఎందుకు అంతలా విరుచుకుపడినట్టో అని విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: