జగన్‌ వ్యూహం: బాబు అరెస్టులో మోడీ పాత్ర ఎంత?

తాజాగా చంద్రబాబు నాయుడుని స్కిల్ కుంభకోణంలో  సిఐడి అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే  చంద్రబాబు నాయుడు అరెస్టు వెనకాల ముఖ్యంగా జగన్ పావులు కదిపారని చాలామంది బలంగా అనే మాట.  అయితే ఇదే నిజమైతే ప్రధాన ప్రతిపక్షం అయినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకున్ని జైల్లో పెడితే ఆ పార్టీపై ప్రజల్లో సానుభూతి అనేది పెరిగే  అవకాశం ఉంది. దీని వల్ల తెలుగు దేశం పార్టీ గురించి జనాలు ఆలోచించడం మొదలుపెట్టి, దానికి వచ్చే ఏడాది ఓట్లు వేసేసే అవకాశం కూడా మెండుగా ఉంది.


మరి జగన్ కు ఇవన్నీ తెలిసి చంద్రబాబునాయుడు అరెస్టు అయితే చేయించడు కదా అని అంటున్నారు కొంత మంది. అయితే గతంలోనే  చంద్రబాబునాయుడుని అరెస్టు చేస్తారట అని అంటే  చంద్రబాబు నాయుడుని అరెస్టు చేయటం అనేది వట్టి జోక్ అని అనుకున్నారు అందరూ. ఒకవేళ పొరపాటున అరెస్టు చేసినా వెంటనే బెయిల్ పైన బయటికి వచ్చేస్తారని అనుకున్నారు వాళ్ళు. అయితే ఆయనకు బెయిల్ రాలేదు.


బెయిల్ రాకపోగా, రిమాండ్ కూడా విధించడం చూసిన తర్వాత అప్పుడు అనుకున్నారు ఈ కేసు వెనకాల బలమైన కుట్ర ఏదో నడుస్తుందని. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండూ కలిపి చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టించాయని అనుకున్నారు. అయితే 409 కింద, అలాగే 17 ఏ సి సెక్షన్స్ కింద అరెస్టు చేయడం తప్పని కింద కోర్టులు చెప్పాయి. అయితే ఈ రెండు సెక్షన్స్ కూడా అప్లికేబుల్ అని హైకోర్టు చెప్పడం జరిగింది.


అసలు 17 ఏ సీ సెక్షన్ ప్రకారం ప్రభుత్వం లో పనిచేసే వ్యక్తిని లేదా ప్రభుత్వ జీతం తీసుకున్నటువంటి వ్యక్తిని అరెస్టు చేయాలంటే గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత కాబట్టి అరెస్టు చేయాలంటే స్పీకర్ పర్మిషన్ తీసుకోవాలని అంటున్నారు. ఇంకా చెప్పాలంటే స్పీకర్ కు ఇంటిమేట్ చేస్తే సరిపోతుంది అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: