హైదరాబాద్ తెలుగుదేశం ఉద్యమానికి బ్రేక్?
అంతే కాకుండా మా జీవితంలో వెలుగులు నింపినటు వంటి చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉంటాం అంటూ ఉద్యోగులు పేర్కొన్నారు అని తెలుస్తుంది. చంద్రబాబు నాయుడుపై అక్రమంగా ఆరోపణలు చేసి జైల్లో పెట్టారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తి వేసి ఆయన్ని విడుదల చేయాలని వాళ్ళు డిమాండ్ చేశారు. ఐటీ అంటే బాబుగారు, బాబుగారు అంటే ఐటి అంటూ ప్లకార్డులతో ప్రదర్శనలు చేశారు.
విప్రో సర్కిల్ వద్ద మొదలైన ఈ భారీ ర్యాలీ ఔటర్ రింగ్ రోడ్డు వరకు జరిగింది. అయితే ఇలాంటివి తెలంగాణ ప్రభుత్వానికి నచ్చవని అంటున్నారు కొంతమంది. అక్కడ ఈ ర్యాలీ వల్ల ట్రాఫిక్ కు అంతరాయం కలగడంతో పోలీసులు తమ కర్తవ్యాన్ని చేపట్టారు. అయితే మొదట్లో మొహమాటంతో, చంద్రబాబు నాయుడి సామాజిక వర్గానికి సంబంధించిన అధికారులు చెప్పారని ఎంప్లాయిస్ ఈ ఆందోళనలకు వెళ్లారట.
రెండో రోజు ఇలా విప్రో సర్కిల్ దగ్గర ఆందోళన చేద్దాం అని చెప్పుకొని అక్కడ జమ కూడారట. అయితే అక్కడికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రేణులు కూడా రావడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగిందని తెలుస్తుంది. అయితే ఈ కార్యక్రమాన్ని గనుక భగ్నం చేస్తే వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని టిడిపి సోషల్ వింగ్ కు సంబంధించిన వ్యక్తులు అన్నారని తెలుస్తుంది. కొన్ని ఐటీ కంపెనీలు అయితే తమ ఉద్యోగులను ఈ ఆందోళనలో పార్టిసిపేట్ చేయొద్దని గట్టిగా చెప్పాయట.